iPhone 12 Mini Price in India : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 12 మినీ సొంతం చేసుకోవాలంటే? ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

iPhone 12 Mini Price in India : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Year End Sale 2022) సందర్భంగా అనేక ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 12 మినీ మోడల్ అత్యంత చౌకైన ధరకే అందుబాటులో ఉంది.

iPhone 12 mini price in India at its lowest during Flipkart year-end sale_ check deal

iPhone 12 Mini Price in India : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Year End Sale 2022) సందర్భంగా అనేక ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 12 మినీ మోడల్ అత్యంత చౌకైన ధరకే అందుబాటులో ఉంది. మీరు కూడా ఐఫోన్ తక్కువ ధరకు కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. డిసెంబర్ 31తో ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ముగియనుంది.

మరికొద్దిగంటల్లో ఈ సేల్ ఆఫర్ ఎండ్ కాబోతోంది. ఆపిల్ (iPhone 12 mini) అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మార్కెట్లో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్ కొనసాగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 35 శాతం కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. భారత మార్కెట్లో సరికొత్త Apple iPhone 14 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత.. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం iPhone 12 miniతో సహా అనేక ఐఫోన్‌లను నిలిపివేసింది. అయితే, ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేసేందుకు ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 12 : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

భారత మార్కెట్లో iPhone 12 మినీ ధర ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లోని లిస్టింగ్ ప్రకారం.. ఐఫోన్ 12 మినీ బేస్ మోడల్ 38 శాతం డిస్కౌంటుతో అందుబాటులో ఉంది. ఆపిల్ నిలిపివేసిన మోడల్ లిస్టులో (iPhone 12 Mini) మోడల్ ఒకటిగా ఉంది. దీని ధర మార్కెట్లో ధర రూ . 36,999గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుపై వినియోగదారులు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

iPhone 12 mini price in India at its lowest during Flipkart year-end sale

ఐఫోన్ 12 మినీ ఇతర ఐఫోన్ 12 సిరీస్ మోడళ్లతో పాటు 2020లో లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఐఫోన్ 12 మినీ ధర ప్రారంభించిన సమయంలో రూ.69,900 వద్ద ప్రారంభమైంది. ఐఫోన్ అనేక సార్లు భారీ తగ్గింపులతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చింది. గత మేలో, ఐఫోన్ 12 మినీ ఫ్లిప్‌కార్ట్‌లో 256GB వేరియంట్ ధర రూ.64,999కి అందుబాటులో ఉంది.

ఐఫోన్ 12 మినీ స్పెషిఫికేషన్లు ఇవే :
ఐఫోన్ 12 మినీలో 5.4-అంగుళాల స్క్రీన్ సైజ్, ఎడ్జ్-టు-ఎడ్జ్ OLED సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 460ppi పిక్సెల్ డెన్సిటీ, HDR 10, HLG HDR సపోర్ట్ ఉన్నాయి. వెనుకవైపు LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ 12MP సెన్సార్‌లను కలిగి ఉన్న స్క్వారీష్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ విస్తృత నాచ్‌లో ఉన్న 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. చిప్‌సెట్ విషయానికి వస్తే.. ఐఫోన్ 12 మినీ 5nm A14 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. A12 బయోనిక్ కన్నా 40 శాతం మెరుగైన CPU పర్ఫార్మెన్స్ అందిస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. బాక్స్ వెలుపల iOS 14 రన్ అవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 12 : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?