iPhone 18 Pro : వావ్.. ఆపిల్ కొత్త గేమ్ స్టార్ట్ చేసిందా? ఐఫోన్ 18 ప్రో 4 కలర్స్ లీక్.. బిగ్ ట్విస్ట్ బయటపడిందా?

iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన సిరీస్ వచ్చేస్తోంది. ఈసారి ఐఫోన్ 18 ప్రో సిరీస్ మొత్తం 4 కలర్ వేరియంట్లలో రాబోతుంది. లాంచ్ కుముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.

iPhone 18 Pro

  • ఐఫోన్ 18 ప్రో 4 కలర్ వేరియంట్లు లీక్ అయ్యాయి
  • డార్క్ చెర్రీ స్పెషల్ ఐఫోన్ షేడ్‌గా కనిపిస్తుంది
  • ఈ ఫోన్ సిల్వర్, బ్లాక్, లైట్ బ్లూ, డార్క్ చెర్రీ కలర్ ఆప్షన్లు
  • రియర్ కెమెరా డిజైన్, పాత సిరీస్‌ను పోలి ఉన్నట్లు కనిపిస్తోంది

iPhone 18 Pro : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 18 ప్రో సిరీస్ రాబోతుంది. ఐఫోన్ 18ప్రోకి సంబంధించిన కొత్త లీక్ డేటా రివీల్ అయింది. ఈ ఐఫోన్ గురించి ఇప్పటికే అనేక ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ఇప్పుడు రాబోయే ఐఫోన్ ఫ్రంట్ సైడ్ డిజైన్ మారబోతోంది.

ఇందులో చిన్న డైనమిక్ ఐలాండ్ కూడా ఉంటుంది. కంపెనీ కెమెరా కోసం భారీ అప్‌గ్రేడ్‌ అందించనుంది. ఐఫోన్ కలర్ వేరియంట్ల గురించే మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. లాంచ్‌కు ముందే ఐఫోన్ 4 కలర్ వేరియంట్లు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో కలర్ ఆప్షన్లను ఓసారి పరిశీలిద్దాం..

డమ్మీ యూనిట్లు లీక్.. 
ఐఫోన్ 18 ప్రో కలర్ వేరియంట్‌లకు సంబంధించి కొత్త వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 4 కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుందని భావిస్తున్నారు. ఈసారి, కంపెనీ ఈ ఫోన్‌ను పూర్తిగా విభిన్నమైన కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్ డమ్మీ యూనిట్లు లీక్ అయ్యాయి. ఐఫోన్ డిజైన్, కలర్ వేరియంట్‌లు రివీల్ అయ్యాయి. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఈ పోస్ట్, డమ్మీ యూనిట్లు, ఐఫోన్ కలర్ ఆప్షన్లను చూడొచ్చు.

Read Also : Upcoming Smartphones : ఇక మొబైల్ మార్కెట్ షేక్! జూన్ ఫస్ట్ వీక్‌లో రాబోయే సూపర్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే!

ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్స్ కలర్ ఆప్షన్లు చాలా ప్రత్యేకంగా ఉండనున్నాయి. రియర్ కెమెరా డిజైన్ గత సిరీస్‌ను పోలి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్‌లో భారీ కెమెరా బార్ ఉంది. ఈ ఫోన్‌ను సిల్వర్, బ్లాక్, లైట్ బ్లూ, డార్క్ చెర్రీ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

స్పెషాలిటీ ఏంటంటే.. :
కంపెనీ చాలా ఏళ్ల తర్వాత క్లీన్ బ్లాక్ కలర్ మోడల్ మళ్లీ తీసుకురానుంది. డార్క్ చెర్రీ ఈ ఫోన్ కలర్ అత్యంత ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఆపిల్ ఇలాంటి కలర్ వాడటం ఇదే ఫస్ట్ టైమ్ కానుంది.

ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లలో డైనమిక్ ఐలాండ్ సైజును కంపెనీ భారీగా తగ్గించబోతున్నట్లు సమాచారం. డిస్‌ప్లే కింద ఫేస్ ఐడీ ఇన్‌ఫ్రారెడ్ ఇల్యూమినేటర్‌ను కంపెనీ అమర్చనుంది. అలాగే, పిల్ షేప్ ఉండే డైనమిక్ ఐలాండ్‌లోనే కెమెరా, డాట్ ప్రొజెక్టర్ ఉంటాయి.

ఐఫోన్ 18 ప్రోలో, 2nm ప్రాసెస్‌పై కంపెనీ A20 SoC చిప్‌సెట్‌ను అమర్చే అవకాశం ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడళ్లు సెప్టెంబర్ 2026లో లాంచ్ కావచ్చు. అయితే, ఈ అప్‌డేట్‌కు సంబంధించి ఆపిల్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.