iPhone 18 Pro Series : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 18 ప్రోలో 5 భారీ మార్పులు.. కెమెరా నుంచి డిజైన్ వరకు..!

iPhone 18 Pro Series : ఆపిల్ రాబోయే ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ టెక్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించాయి. కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా డిజైన్, ఫీచర్లకు సంబంధించిన కొత్త లీకులు వెలుగులోకి వచ్చాయి.

iPhone 18 Pro Series

  • ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఫీచర్లు లీక్
  • ఐఫోన్ 18ప్రో రాబోయే 5 భారీ మార్పులివే
  • కెమెరా నుంచి డిజైన్ వరకు మరెన్నో అప్ గ్రేడ్స్

iPhone 18 Pro Series : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐటీ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రాబోతున్నాయి. ఈ ఐఫోన్ మోడల్స్ లాంచ్ కాకముందే టెక్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించాయి. ఆపిల్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. డిజైన్, ఫీచర్లకు సంబంధించి కొత్త లీకులతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

లీకుల ప్రకారం.. కొన్ని డిజైన్ మార్పులు ఉండనున్నాయి. కెమెరా మాడ్యూల్ గతంలో కన్నా (iPhone 18 Pro Series) మరింత ప్రీమియం లుక్‌ ఉండవచ్చు. ఈ రెండు ఫోన్‌లలోనూ 48MP మెయిన్ కెమెరా ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఫొటో, వీడియో క్వాలిటీని మెరుగుపరుస్తుంది.

ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ కెమెరా ఫీచర్లు :
ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన లీకుల ప్రకారం.. ఈసారి ఆపిల్ భారీ మార్పులు చేయవచ్చు. ఐఫోన్ కెమెరా మాడ్యూల్ గతంలో కన్నా పెద్దదిగా కొద్దిగా బరువుగా ఉండవచ్చు.

వేరియబుల్ అపెర్చర్‌తో కొత్త అడ్వాన్స్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఫొటో క్వాలిటీ మరింత మెరుగుపడవచ్చు. అంతేకాదు.. iOS 27లో కొన్ని ప్రొఫెషనల్-లెవల్ కెమెరా ఫీచర్లు ఉంటాయని అంచనా. ఐఫోన్ కెమెరాను గతంలో లేనంతగా ప్రొఫెషనల్ ఫీచర్లు ఉండొచ్చు.

Read Also : Redmi Note 14 Pro : రెడ్‌మి ఫ్యాన్స్‌కు పండగే.. ఈ రెడ్‌మి నోట్ 14 ప్రో ఇప్పుడు చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!

ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ డిజైన్ :
డిజైన్ పరంగా పరిశీలిస్తే.. ఫ్రంట్ సైడ్ భారీగా మార్పులు రావచ్చు. నివేదికల ప్రకారం.. కంపెనీ డైనమిక్ ఐలాండ్ సైజు సుమారు 25శాతం తగ్గించవచ్చు. స్క్రీన్ మరింత క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ సిరీస్‌లో 2nm టెక్నాలజీపై A20 ప్రో చిప్‌ కూడా అమర్చవచ్చు.

ఒకవేళ ఇది జరిగితే.. ఐఫోన్ స్పీడ్, బ్యాటరీ లైఫ్ మొత్తం పర్ఫార్మెన్స్ భారీగా మెరుగుపడవచ్చు. ఇది కాకుండా, ఈసారి ఆపిల్ కొత్త ప్యాకేజింగ్ టెక్నాలజీతో రానుంది. ర్యామ్ నేరుగా సీపీయూ, జీపీయూ న్యూరల్ ఇంజిన్‌కు లింక్ అయి ఉంటుంది.

ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్ ఎప్పుడు? :
నివేదికల ప్రకారం.. ఆపిల్ 2026 సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ లాంచ్ చేయవచ్చు. అయితే, స్టాండర్డ్ ఐఫోన్ 18 మోడల్ ఆ తర్వాత లాంచ్ కావచ్చని కొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ మోడల్ 2027లోనే ముందుగా రావచ్చు.

ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఖరీదైనదా? :
ప్రస్తుతం, ఐఫోన్ 18 సిరీస్ ధరలు పెరుగుతాయా లేదో ఆపిల్ కంపెనీ రివీల్ చేయలేదు. ఆ సంస్థ ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ ధరలను పెంచింది. నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ మోడళ్లలో ధరల పెరుగుదల ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.