IPL Fans : జియో IPL ఆఫర్ అదుర్స్.. కేవలం రూ.100కే హైస్పీడ్ డేటా, 90 రోజులు మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు!
IPL Fans : ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం జియో అద్భుతమైన క్రికెట్ ప్లాన్ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలో కేవలం రూ. 100కే రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. 90 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు.

JioHotstar
IPL Fans : ఐపీఎల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్ చేస్తోంది. ఐపీఎల్ సీజన్ మొత్తం క్రికెట్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసేందుకు 90 రోజుల రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి, గతంలోనే జియో అనేక జియోహాట్‌స్టార్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.
ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2025) సీజన్ 18 కోసం కేవలం రూ. 100 ధరకే సరసమైన రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. జియో యూజర్లు అద్భుతమైన డీల్‌ను అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో ఆకర్షణీయమైన బెనిఫిట్స్ పొందవచ్చు.
అంతేకాదు.. జియో సబ్‌స్క్రైబర్‌లు రిలయన్స్ జియో OTT ప్లాట్‌ఫామ్‌లో అన్ని IPL మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. ఐపీఎల్‌తో పాటు జియోహాట్‌స్టార్ టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలను ఉచితంగా చూడొచ్చు.
జియో రూ.100 ప్లాన్ :
రిలయన్స్ జియో అందించే ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్ కోసం రూ.100 చెల్లించాలి. 5GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. 90 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ఆఫర్‌లో కాల్స్ లేదా SMS కోసం బెనిఫిట్స్ ఉండవని గమనించాలి.
ఫోన్ కాల్స్ చేయడం లేదా SMS పంపుకోవాలంటే వినియోగదారులు జియో రెగ్యులర్ రీఛార్జ్ ప్లాన్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. అదనంగా, మీరు ప్రస్తుతం నెలవారీ ప్లాన్ కలిగి ఉంటే.. రెండు లేదో మూడో నెలలో JioHotstar సబ్‌స్క్రిప్షన్‌కు ప్రస్తుత ప్యాక్ గడువు ముగియడానికి 48 గంటల ముందు మీ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవాలి.
జియో హాట్‌స్టార్‌తో ఇతర ప్లాన్‌లు :
రూ.100 ప్లాన్‌తో పాటు, జియో రూ.299, రూ.349, రూ.899, రూ.999 ప్లాన్‌లతో సహా అనేక ఇతర రీఛార్జ్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. జియోహాట్‌స్టార్‌కు 90 రోజుల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. జియో వెబ్‌సైట్ ప్రకారం.. రూ.299, రూ.349 ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. 100 ఫ్రీ SMS, రోజుకు వరుసగా 1.5GB, 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి బెనిఫిట్స్‌తో పాటు. రూ.349 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంటుంది.
రూ.899, రూ.999 ప్లాన్‌లను ఎంచుకునే వారికి వినియోగదారులు వరుసగా 90 రోజులు, 98 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లు రోజువారీ 2GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అలవెన్సులతో కూడా వస్తాయి. రూ.899 ప్లాన్ అదనంగా 20GB డేటాను కలిగి ఉంటుంది. రెండు ప్లాన్‌లు యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా అదనపు బోనస్‌ను కూడా అందిస్తాయి.