Airtel IPTV service : ఇక పండగ చేస్కోండి.. కొత్త IPTV సర్వీసు సూపర్ ప్లాన్లు ఇవే.. ఫ్రీగా OTT యాప్స్, 350 టీవీ ఛానల్స్ చూడొచ్చు!
Airtel IPTV service : ఎయిర్‌టెల్ IPTV సర్వీసును భారత మార్కెట్లోని 2000 నగరాల్లో ఏకకాలంలో ప్రారంభించింది. వినియోగదారులు 350 లైవ్ టీవీ ఛానెల్‌లతో పాటు 29 OTT యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

Airtel IPTV service
Airtel IPTV service : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సర్వీసును ప్రారంభించింది. ముందుగా భారత మార్కెట్లో మొత్తంలో 2,000 నగరాల్లో ఈ IPTV సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త ఆఫర్‌లో 350 లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్, యూజర్లు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా 29 OTT యాప్‌లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అంతేకాదు.. ఎయిర్‌టెల్ యూజర్లు తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో లింక్ అయిన ఈ సర్వీసును ఎంజాయ్ చేయొచ్చు. 40Mbps నుంచి 1Gbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ కన్నా ముందే BSNL కొన్ని నెలల క్రితం ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఆధారిత IFTV సర్వీసులను ప్రవేశపెట్టింది.
ఎయిర్‌టెల్ IPTV బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు స్టాండర్డ్ ప్లాన్‌లతో పోలిస్తే.. రూ. 200 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు లైవ్ టీవీ ఛానెల్‌లను పొందవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా సబ్‌స్క్రైబర్‌లు అనేక పాపులర్ OTT యాప్‌లను కూడా యాక్సెస్ చేయొచ్చు. ప్రారంభ ఆఫర్‌ను పొందే యూజర్ల కోసం ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు అందుబాటులో ఉన్న నగరాల్లోని కొత్త IPTV ప్లాన్ కస్టమర్లకు కంపెనీ 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ను కూడా అందిస్తోంది.
రూ. 699 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో వినియోగదారులు 40Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్ సర్వీసును పొందవచ్చు. అలాగే 26 OTT యాప్‌లు, 350 లైవ్ టీవీ ఛానెల్‌లను కూడా చూడవచ్చు.
రూ. 899 ప్లాన్ :
ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వినియోగదారులకు 100Mbps ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. అలాగే 26 OTT యాప్‌లు, 350 లైవ్ టీవీ ఛానెల్‌లను అందిస్తుంది.
రూ.1,099 ప్లాన్ :
ఈ ప్లాన్‌తో వినియోగదారులు 200Mbps ఇంటర్నెట్ స్పీడ్ బెనిఫిట్స్ పొందుతారు. ఇందులో 28 OTT యాప్‌లు, 350 లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్, అలాగే రెండు యాడ్-ఆన్ యాప్‌లు, ఆపిల్ టీవీ ప్లస్, అమెజాన్ ప్రైమ్ ఉన్నాయి.
రూ.1,599 ప్లాన్ :
ఈ ఆఫర్‌లో వినియోగదారులు 300Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను యాక్సస్ చేయొచ్చు. అలాగే 29 OTT యాప్‌లు, 350 లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో ఆపిల్ టీవీ+, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అనే మూడు అదనపు యాప్‌లు కూడా ఉన్నాయి.
రూ. 3,999 ప్లాన్ :
ఈ ప్రీమియం ప్లాన్ వినియోగదారులకు ఆకట్టుకునే 1Gbps ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. దాంతో పాటు, సబ్‌స్క్రైబర్‌లు 29 OTT యాప్‌లు, 350 లైవ్ టీవీ ఛానెల్‌లతో పాటు 3 అదనపు అప్లికేషన్‌లను కూడా యాక్సెస్ చేయొచ్చు. అందులో Apple TV+, Netflix, Amazon Prime ఉన్నాయి.