Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? ఏప్రిల్‌లో రాబోయే సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఈ బ్రాండ్ ఫోన్ల లవర్స్ రెడీగా ఉండండి..!

Upcoming Smartphones : ఏప్రిల్ 2025లో శాంసంగ్, వివో, పోకో, రియల్‌మి బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. రాబోయే ఈ ఫోన్లకు సంబంధించి ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? ఏప్రిల్‌లో రాబోయే సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఈ బ్రాండ్ ఫోన్ల లవర్స్ రెడీగా ఉండండి..!

Upcoming Smartphones

Updated On : March 26, 2025 / 5:37 PM IST

Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మరికొద్ది రోజులు ఆగండి.. వచ్చే ఏప్రిల్‌లో భారత మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఔత్సాహికుల కోసం Samsung, Vivo, POCO, Realme వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమ లేటెస్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు వైడ్ రేంజ్ యూజర్లకు తగినట్టుగా అత్యాధునిక టెక్నాలజీ, వినూత్న ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

Read Also : Jio Best Offers : జియో యూజర్లకు పండగే.. 365 రోజుల ప్లాన్ భలే ఉందిగా.. 912GB హైస్పీడ్ డేటా, కాలింగ్ బెనిఫిట్స్..!

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ :
వచ్చే ఏప్రిల్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 200MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 3,900mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ శాంసంగ్ ఫోన్ కేవలం 162 గ్రాముల బరువు, 6mm కన్నా తక్కువ మందం కలిగిన అల్ట్రా-సన్నని స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.

అదనంగా, శాంసంగ్ S25 ఎడ్జ్ అడ్వాన్స్‌డ్ AI సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇందులో యూజర్ అసిస్టెన్స్ కోసం రోజువారీ బ్రీఫింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ టైటానియం ఐసీబ్లూ, టైటానియం సిల్వర్, టైటానియం జెట్‌బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లు 12GB RAMతో రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మోడళ్ల మధ్య ధర తగ్గుతుందని భావిస్తున్నారు.

వివో V50 ప్రో 5G :
వివో కొత్త 5జీ ఫోన్ అద్భుతమైన డైమెన్సిటీ 9300 ప్రాసెసర్, 8GB ర్యామ్‌తో రానుంది. వివో V50 ప్రో 5G ఫోన్ ఏప్రిల్‌లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సున్నితమైన విజువల్స్‌ను అందిస్తుంది.

ఫోటోగ్రఫీ ఔత్సాహికులు బ్యాక్ సైడ్ 50MP క్వాడ్-కెమెరా సెటప్, హై క్వాలిటీ సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను పొందవచ్చు. వివో V50 ప్రో 5Gలో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీ ఉంటుంది. లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ 5జీ ఫోన్ ధర సుమారు రూ. 54,990 వద్ద ఉండవచ్చు.

పోకో F7 5G :
పోకో అభిమానులను లక్ష్యంగా పోకో F7 5G ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 13MP సెకండరీ లెన్స్, 8MP టెర్షియరీ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7,500mAh బ్యాటరీ కలిగి ఉంది. అదేపనిగా రీఛార్జ్‌లు చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ సమయం ఛార్జింగ్ వస్తుంది. పోకో F7 5G ధర రూ. 32,990గా ఉంటుందని అంచనా.

రియల్‌మి GT నియో7 :
రియల్‌మి GT నియో7 ఫోన్ గ్లోబల్ లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఫ్లాగ్‌షిప్-లెవల్ ఫీచర్లను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen3 ప్రాసెసర్, 80W, 100W మధ్య ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 7,000mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.

Read Also : BSNL Offers : BSNL బంపర్ ఆఫర్.. ఏకంగా 150 రోజుల ప్లాన్.. OTT బెనిఫిట్స్, దేశంలో ఎక్కడికైనా ఫ్రీ కాల్స్..!

భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, రియల్‌మి GT నియో 7 8.5mm మందంతో వస్తుంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అత్యంత శక్తివంతమైనది. చైనాలో లాంచ్ అయిన జీటీ నియో 7 త్వరలోనే అంతర్జాతీయంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.