iQOO 12 Price : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. అత్యంత చౌకైన ధరకే ఐక్యూ 12 ఫోన్.. ఇలాంటి డీల్ మళ్లీ జన్మలో రాదు..!

iQOO 12 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. సరసమైన ధరకే ఐక్యూ 12 ఫోన్ సొంతం చేసుకోండి. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iQOO 12 Price : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. అత్యంత చౌకైన ధరకే ఐక్యూ 12 ఫోన్.. ఇలాంటి డీల్ మళ్లీ జన్మలో రాదు..!

iQOO 12 Price

Updated On : July 2, 2025 / 6:08 PM IST

iQOO 12 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఐక్యూ 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ప్రీమియం ఫోన్ (iQOO 12 Price) రూ. 13వేలకే కొనేసుకోవచ్చు.
ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఐక్యూ 12 ఫోన్ సరసమైన ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో ఐక్యూ 12 డీల్ :
భారత మార్కెట్లో ఐక్యూ 12 ఫోన్ (16GB + 512GB ) వేరియంట్ రూ.57,999కు లాంచ్ అయింది. అమెజాన్ ప్రస్తుతం ఈ ఫోన్ మోడల్‌పై రూ.13వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దాంతో ఐక్యూ 12 ధర రూ.44,999కు తగ్గింది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపు పొందవచ్చు.

Read Also : Top 3 Smart TVs : అమెజాన్‌లో రూ. 12వేల లోపు ధరకే టాప్ 3 స్మార్ట్‌టీవీలు.. ఖతర్నాక్ ఫీచర్లు భయ్యా.. ఆర్డర్ పెట్టేసుకోండి!

ఐక్యూ 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐక్యూ 12 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల (iQOO 12 Price) అమోల్డ్ డిస్‌ప్లే 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, HDR10+కి సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద, ఐక్యూ 12 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం Q1 గేమింగ్ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. ఇంకా, ఈ ఐక్యూ ఫోన్ 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 64MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్‌ను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరా కూడా ఉంది.