Top 3 Smart TVs : అమెజాన్‌లో రూ. 12వేల లోపు ధరకే టాప్ 3 స్మార్ట్‌టీవీలు.. ఖతర్నాక్ ఫీచర్లు భయ్యా.. ఆర్డర్ పెట్టేసుకోండి!
Top 3 Smart TVs : అమెజాన్‌లో స్మార్ట్‌టీవీలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. కేవలం రూ. 12వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.

Top 3 Smart TVs
Top 3 Smart TVs : మీరు కొత్త బ్రాండెడ్ LED టీవీ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. రూ. 12వేల కన్నా తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్‌టీవీలు అందుబాటులో (Top 3 Smart TVs) ఉన్నాయి. డాల్బీ సౌండ్, ఆకర్షణీయమైన డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. అమెజాన్ ఇండియాలో 3 సరసమైన స్మార్ట్‌టీవీలు లభ్యమవుతున్నాయి.
ఈ టీవీలు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ధర కూడా రూ. 12వేల కన్నా చాలా తక్కువ. అత్యుత్తమ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ డాల్బీ సౌండ్‌ను అందిస్తాయి. సరసమైన ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లతో LED టీవీ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ లిస్టులో రెడ్‌మి టీవీ కూడా ఉంది. ఈ స్మార్ట్ టీవీలను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
షావోమీ రెడ్‌మి 80 సెం.మీ (32 అంగుళాలు) :
అమెజాన్ ఇండియాలో ఈ స్మార్ట్‌టీవీ ధర రూ.11,499కు లభిస్తుంది. రూ.344 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.2,830 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ, పాత టీవీ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో HD రెడీ డిస్‌ప్లే ఉంది. డాల్బీ ఆడియో కూడా సపోర్టు అందిస్తుంది.
షావోమీ MI A 80cm స్మార్ట్‌టీవీ (32) :
అమెజాన్ ఇండియాలో ఈ షావోమీ టీవీ రూ. 11990కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ రూ. 359 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ డీల్ ద్వారా రూ. 2830 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ, పాత టీవీ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ షావోమీ టీవీ HD రెడీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ టీవీ డాల్బీ ఆడియోకు సపోర్టు ఇస్తుంది. 20-వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.
వోక్స్‌వ్యాగన్ 80 సెం.మీ (32 అంగుళాలు) :
ఈ స్మార్ట్‌టీవీ ధర రూ.7,999. బ్యాంక్ ఆఫర్లు 10శాతం వరకు తక్కువగా ఉండవచ్చు. రూ.239 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రూ.2830 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కొనుగోలు చేయొచ్చు. ఈ బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ, పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, అన్నీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 24 వాట్ సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.