iQOO 15T Launch : గేమర్లకు పండగే.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త సూపర్ ఫోన్!
iQOO 15T Launch : ఈ నెల 20వ తేదీన చైనా మార్కెట్లో ఐక్యూ 15T లాంచ్ చేయనున్నట్టు ఐక్యూ కంపెనీ ధృవీకరించింది. పూర్తి ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Updated on- May 13, 2026 / 06:54 PM IST
iQOO 15T Launch ( Illustration generated using AI )
- ఐక్యూ 15టీ 6.82-అంగుళాల 2K+ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే
- 200MP ప్రైమరీ కెమెరా, 8000mAh బ్యాటరీ సెటప్
- 100W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్
iQOO 15T Launch : కొత్త ఐక్యూ ఫోన్ రాబోతుంది. చైనా మార్కెట్లో ఐక్యూ 15T లాంచ్ చేయనున్నట్టు ఐక్యూ ధృవీకరించింది. ఈ నెల 20వ తేదీన ఈ ఫోన్ ఆవిష్కరించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ కూడా అదే రోజున ప్రారంభం కానున్నాయి.
రాబోయే ఈ ఐక్యూ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 15 మాదిరిగానే అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. అజూర్ క్లౌడ్ కలర్ ఆప్షన్ లభ్యం అవుతుంది. బ్యాక్ సైడ్ క్లౌడ్ వంటి మోడల్ ఉంటుంది. ఐక్యూ 15టీ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల నుంచి డిజైన్ వరకు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐక్యూ 15T ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
మే 20న చైనాలో ఐక్యూ 15టీ లాంచ్ కానుంది. ఐక్యూ 15T ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్, ట్రాన్స్‌పరంట్ ఫ్యూచర్ తరహా క్యాబిన్ డిజైన్ అందిస్తుంది. చైనా టెలికాం వెబ్‌సైట్ ప్రకారం.. ఐక్యూ 15టీలో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, భారీ 8000mAh బ్యాటరీ, 200MP ప్రైమరీ కెమెరా ఉంటాయి.
Read Also : New Labour Code : వారానికి ఇక 4 రోజులు పని మాత్రమే! కొత్త లేబర్ రూల్స్‌లో షాకింగ్ ట్విస్ట్!
ఐక్యూ 15టీ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఐక్యూ 15టీలో 3168×1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.82-అంగుళాల 2K+ BOE Q10+ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది.
ఈ ఫోన్‌లో ఆర్మ్ మాలి-G1 అల్ట్రా MC12 జీపీయూతో ఆక్టా-కోర్ డైమెన్సిటీ 9500 3nm ప్రాసెసర్ ఉంటుంది. 12GB, 16GB LPDDR5X అల్ట్రా ర్యామ్, 256GB, 512GB/1TB (UFS 4.1) స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6.0 తో వస్తుంది. ఈ ఫోన్‌లో 8000mAh బ్యాటరీ ఉంది. 100W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఐక్యూ 15టీలో బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది. ఇందులో 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ 163.37 మిమీ పొడవు, 76.71 మిమీ వెడల్పు, 8.25 మిమీ మందం, 216 గ్రాముల బరువు ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-సి పోర్ట్, NFC ఉన్నాయి.
