iQOO Neo 7 Pro Price Drop : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. ఐక్యూ నియో 7 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఈ ఫోన్ కొనాలా వద్దా?
iQOO Neo 7 Pro Price Drop : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐక్యూ నియో 7 ప్రో భారీ ధర తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ కొనడం విలువైనదేనా? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : January 13, 2024 / 06:19 PM IST
iQOO Neo 7 Pro gets massive price drop during Amazon Great Republic Day sale
iQOO Neo 7 Pro Price Drop : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐక్యూ నియో 7 ప్రో ధర తగ్గింది. భారత మార్కెట్లోరూ. 34,999కి లాంచ్ అయిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 30,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌లపై అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.50వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 13 సొంతం చేసుకోండి
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐక్యూ నియో 7 ప్రో ధర తగ్గింది.. ఇప్పుడు ఈ ఫోన్కొనడం విలువైనదేనా? అంటే.. ఐక్యూ నియో 7 ప్రోతో దాదాపు రూ. 30వేల ధరలో ఉండవచ్చు. ఎందుకంటే.. ఈ ఫోన్ చాంప్ వంటి అన్ని రకాల పనులను నిర్వహించగలదు. ముఖ్యంగా గేమింగ్ విషయానికి వస్తే.. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ ఫోన్ సమర్థవంతమైన కూలింగ్ సిస్టమ్, గేమింగ్ పర్ఫార్మెన్స్ టాప్ ప్లేసులో ఉంటుంది.
ఐక్యూ నియో 7 ప్రో స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఐక్యూ నియో 7 ప్రో అద్భుతమైన 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫ్లాట్‌గా ఉంటుంది. పవర్‌ఫుల్ 10-బిట్ కలర్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. మృదువైన 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో హెచ్‌డీఆర్ కంటెంట్‌ని ఎక్కువగా చూడటానికి లేదా టాప్-టైర్ 1200హెచ్‌జెడ్ టచ్ రెస్పాన్స్‌తో బీజీఎంఐనిడామినేట్ చేయగలదు.
iQOO Neo 7 Pro massive price drop
ఐక్యూ నియో 7 ప్రో మోడల్ డిస్‌ప్లే, పర్పార్మెన్స్ కెమెరాలతో ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా మంచి లైటింగ్‌లో అద్భుతమైన షాట్‌లను క్యాప్చర్ చేయగలదు. సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. ఐక్యూ నియో 7 ప్రో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ భారీ వినియోగంతో సులభంగా ఒక రోజు వరకు ఉంటుంది.
లాంగ్ వీడియో కాల్‌లు, యూట్యూబ్ స్ట్రీమింగ్, సీఓడీ మొబైల్, బీజీఎంఐలో గేమింగ్ సెషన్‌లు వంటి టాస్క్‌లు వినియోగించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ, 120డబ్ల్యూ ఛార్జింగ్ ఫోన్‌ను దాదాపు 20 నిమిషాల్లో జీరో నుంచి 100 ఛార్జింగ్ పూర్తి చేస్తుంది.
