iQOO Z11 Launch : ఐక్యూ లవర్స్ గెట్ రెడీ.. 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో కొత్త ఐక్యూ Z11 వస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!

iQOO Z11 Launch : ఐక్యూ జెడ్ 11 అతి త్వరలో లాంచ్ కాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మోడల్ చైనీస్ వెర్షన్ కన్నా కొన్ని స్పెసిఫికేషన్లలో వేరుగా ఉండొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌తో వస్తుంది.

iQOO Z11 Launch

  • ఐక్యూ జెడ్11 మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌
  • ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది
  • 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్‌

iQOO Z11 Launch : ఐక్యూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రముఖ వివో సబ్-బ్రాండ్ ఐక్యూ వచ్చే నెలలో భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఐక్యూ జెడ్11 ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. భారత మార్కెట్లో త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది.

కొన్ని స్పెసిఫికేషన్లు చైనీస్ వేరియంట్‌కు భిన్నంగా ఉండొచ్చు. ఐక్యూ జెడ్11 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌తో (iQOO Z11 Launch) రన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ చైనీస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌తో వస్తుంది.

ఇప్పటికే, ఐక్యూ Z11 డివైజ్ లాంచ్‌ను కంపెనీ టీజ్ చేసింది. ఆ పోస్ట్‌లో 3 బైనరీ కోడ్ స్ట్రింగ్‌లు ఉన్నాయి. ఈ కోడ్‌లను డీక్రిప్ట్ చేయగా ఐక్యూ జెడ్11 ఫోన్ అని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే, ఐక్యూ లాంచ్ తేదీ, చిప్‌సెట్, ఇతర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

Read Also : HMD Pulse 2 Series : HMD కొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ అంచనాలు.. లాంచ్‌కు ముందే పల్స్ 2 సిరీస్ ఫీచర్లు లీక్..!

ఆగస్టులో ఐక్యూ జెడ్ 11 లాంచ్ :
నివేదికల ప్రకారం.. ఐక్యూ జెడ్11 ఫోన్ ఆగస్టులో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌తో ఐక్యూ నుంచి రాబోతున్న ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే.. చైనీస్ వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ ఉంటుంది. భారత మార్కెట్లో రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో రివీల్ కానున్నాయి.

చైనాలో లాంచ్ అయిన ఐక్యూ జెడ్11 ఫోన్ 6.83-అంగుళాల (1,260 x 2,800 పిక్సెల్స్) అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. దీనికి 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ HDR సపోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఐక్యూ జెడ్11 ఫోన్ 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 9,020mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.