iQOO Z11 Lite : కొత్త ఐక్యూ ఫోన్ అదిరిందిగా.. AI ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

iQOO Z11 Lite Launch : ఐక్యూ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. భారత మార్కెట్లోకి ఐక్యూ జెడ్11 లైట్ 5జీ వచ్చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే ఉన్నాయి.

iQOO Z11 Lite Launch

  • అదిరిపోయే ఫీచర్లతో ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ లాంచ్
  • 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్

iQOO Z11 Lite Launch : కొత్త ఐక్యూ ఫోన్ కొంటున్నారా? ఐక్యూ ఇండియా ఐక్యూ జెడ్11 లైట్ 5జీ ఫోన్ అధికారికంగా లాంచ్ చేసింది. వివో సబ్-బ్రాండ్ ఐక్యూ ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో వస్తుంది. ప్రారంభ ఆఫర్లతో పోలిస్తే రూ. 18వేల లోపు ఉంటుంది. సరికొత్త ఐక్యూ జెడ్11 లైట్ గురించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

ఐక్యూ జెడ్11 లైట్ స్పెసిఫికేషన్లు :
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూ జెడ్11 లైట్‌కు 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ వరకు హై బ్రైట్‌నెస్ మోడ్‌తో 6.74-అంగుళాల HD+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అందించింది. ఈ స్క్రీన్‌లో సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ ఉండగా 8.4mm మందంతో 209 గ్రాముల బరువు ఉంటుంది.

ఈ ఐక్యూ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ అందిస్తుంది. ఐక్యూ కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్‌లో 5,79,000 పాయింట్లకు పైగా స్కోర్ చేసింది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో వస్తుంది.

ఈ చైనీస్ టెక్ దిగ్గజం రెండు ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. ఏఐ క్రియేషన్, ఏఐ క్యాప్షన్స్ గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.

Read Also : OnePlus N6x Launch : కొత్త వన్‌ప్లస్ N6x ఫోన్ వచ్చేస్తోంది.. టెక్చర్డ్ బ్యాక్‌తో స్టైలిష్ ఎంట్రీ!

ఐక్యూ జెడ్11 లైట్‌లో 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీ ఉంది. కేవలం 10 నిమిషాల క్విక్ ఛార్జ్‌తో 8 గంటల వరకు కాలింగ్ లేదా 7 గంటలకు పైగా ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని ఐక్యూ చెబుతోంది. ఈ ఫోన్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ బైపాస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

కెమెరాల విషయానికొస్తే.. :
ఈ హ్యాండ్‌సెట్ బ్యాక్ సైడ్ 50MP సోనీ మెయిన్ కెమెరాతో పాటు సెకండరీ సెన్సార్ ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌, మిలిటరీ-గ్రేడ్ మన్నిక SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ అందిస్తుంది.

ధర, కలర్ ఆప్షన్లు :
ఐక్యూ జెడ్11 లైట్ 5జీ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర రూ. 19,499, 6GB + 128GB మోడల్ ధర రూ. 21,499, 6GB + 256GB వెర్షన్ ధర రూ. 24,499 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 1,500 అర్హత గల బ్యాంక్ ఆఫర్లతో ప్రారంభ ధర రూ. 17,999కి తగ్గుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 30 నుంచి అమెజాన్, ఐక్యూ ఇండియా వెబ్‌సైట్ అధీకృత రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి వస్తుంది. ఆసక్తిగల కస్టమర్లు సోలార్ ఫ్లేమ్ మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.