iQOO Z11i Launch : 6500mAh బ్యాటరీ, 120Hz HD ప్లస్ డిస్‌ప్లేతో కొత్త ఐక్యూ Z11i వచ్చేసింది.. ధర మీ బడ్జెట్‌లోనే..
iQOO Z11i Launch : ఐక్యూ యూజర్లకు గుడ్ న్యూస్.. 6500mAh బ్యాటరీతో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్, 6,500 బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- July 3, 2026 / 05:25 PM IST
iQOO Z11i Launch
- ప్రాసెసింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్
- బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా సెటప్
- సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా
iQOO Z11i Launch : ఐక్యూ అభిమానులకు పండగే.. కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా ఐక్యూ జెడ్11ఐ ఫోన్ లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ ఐక్యూ జెడ్11ఐలో HD+ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్ ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 1200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
కంపెనీ ఈ ఫోన్‌లో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే అందించింది. ప్రాసెసింగ్ కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ఉంది. 8GB వరకు ర్యామ్ కూడా ఉంది. ఇందులో 6500mAh బ్యాటరీ ఉంది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐక్యూ జెడ్11ఐ ధర, లభ్యత :
చైనాలో ఐక్యూ జెడ్11ఐ ఫోన్ 6GB + 128GB మోడల్ ధర 1,299 యువాన్ల (సుమారుగా రూ. 18వేలు) నుంచి (iQOO Z11i Launch) ప్రారంభమవుతుంది. 8GB + 128GB వేరియంట్ ధర 149 యువాన్లు (సుమారుగా రూ. 21,000), కాగా టాప్-ఎండ్ 8GB + 256GB వేరియంట్ ధర 1,699 యువాన్లు (సుమారుగా రూ. 24వేలు) ఉంటుంది. ఈ ఫోన్ చైనాలో ఇంక్ షాడో, కింగ్‌ఫెంగ్ డెసర్ట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఐక్యూ జెడ్11ఐ స్పెసిఫికేషన్లు :
ఐక్యూ జెడ్11ఐ ఫోన్ HD+ రిజల్యూషన్ (1600 x 720 పిక్సెల్స్) 6.74-అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్ ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 1200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. కంపెనీ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఈ ఫోన్‌లో డీసీ డిమ్మింగ్ టీయూవీ రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ప్రాసెసింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ అమర్చారు. 8GB వరకు LPDDR4X ర్యామ్ 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందించారు. ఈ స్టోరేజీ ఇంకా పెంచుకోవాలంటే మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే..
ఇందులో ఆటోఫోకస్ లెన్స్‌తో 13MP రియర్ కెమెరా ఉంది. 1080p వీడియోను రికార్డ్ చేయగలదు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో యూఎస్‌బీ టైప్-C, బ్లూటూత్ 5.1, సింగిల్ ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. డస్ట, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 15W ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీ ఉంది. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
