iQOO Z11x 5G : 7200mAh భారీ బ్యాటరీ, ఐక్యూ Z11x 5G ఫస్ట్ సేల్.. ఇలా కొన్నారంటే మీ బడ్జెట్ ధరలోనే!
iQOO Z11x 5G : ఐక్యూ అభిమానులకు పండగే. భారత మార్కెట్లో ఇటీవలే భారీ బ్యాటరీతో వచ్చిన ఐక్యూ Z11x 5G ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published On : March 15, 2026 / 07:37 PM IST
iQOO Z11x 5G : ఐక్యూ అభిమానులకు అదిరిపోయే వార్త.. ఐక్యూ లేటెస్ట్ ఫోన్ Z11x 5జీ అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ అయింది. రూ. 20,000 బడ్జెట్ కేటగిరీలో ఈ ఫోన్ చాలా బెస్ట్. భారీ 7200mAh బ్యాటరీతో గేమర్‌లకు అద్భుతంగా ఉంటుంది. మార్చి 16న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. మీరు యాక్సస్ లేదా ఎస్బీఐ కార్డ్‌తో భారీ తగ్గింపు పొందవచ్చు.
ధర, లభ్యత : కంపెనీ ఐక్యూ Z11x 5జీ ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో అందిస్తోంది. బేస్ మోడల్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. మిడ్-రేంజ్ వెర్షన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ రూ. 20,999కు వస్తుంది.
8GB ర్యామ్, 256GB స్టోరేజ్ టాప్ ఆప్షన్ ధర రూ. 22,999కు లభిస్తుంది. ఈ సేల్ ఫస్ట్ డే యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇన్ స్టంట్ రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ప్రిస్మాటిక్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
డిస్‌ప్లే, డిజైన్ : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.76-అంగుళాల ఫుల్ HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రోలింగ్, గేమ్‌ప్లే బెటర్. సూర్యకాంతిలో కూడా క్లియర్ వ్యూ ఉంటుంది. IP68, IP69+ రేటింగ్ అందిస్తుంది.
ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ : మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్ కోసం ఐక్యూ 4nm టెక్నాలజీ, మీడియాటెక్ డైమన్షిటీ 7400 టర్బో చిప్‌సెట్ అందిస్తుంది. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కోసం బ్యాటరీ గణనీయంగా భారీగా తగ్గిస్తుంది. మెరుగైన గ్రాఫిక్స్, యాప్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 8GB వరకు LPDDR4x ర్యామ్, 256GB హై-స్పీడ్ UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ ఫ్రంట్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వివో లేటెస్ట్ OriginOS 6పై రన్ అవుతుంది. రెండు ఏళ్ల మెయిన్ OS అప్ డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
కెమెరా, బ్యాటరీ : ఐక్యూ Z11x 5జీ కెమెరా విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. పవర్‌ఫుల్ ఫొటోలతో వస్తుంది. పోర్ట్రెయిట్ ఫొటోలకు 2MP బోకె లెన్స్ కూడా ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. భారీ 7,200mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 3 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుంది.
