ChatGPT Brain Study : ChatGPT వాడితే నిజంగా బుర్ర పాడవుతుందా? షాకింగ్ స్టడీ ఏం చెబుతోందంటే…
ChatGPT Brain Study : చాట్‌జీపీటీని ఎక్కువగా వాడేవారిలో ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుందా? MIT పరిశోధనలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పరిమితులు, ఏఐ వినియోగంపై నిపుణుల సూచనలివే..
- Sreehari A
- Published on- August 23, 2026 / 02:37 PM IST
ChatGPT Brain Study
- AI పై అతిగా ఆధారపడటం చేస్తున్నారా?
- ప్రతి ప్రశ్నకూ ChatGPTనే అడుగుతున్నారా?
- ChatGPT వినియోగదారులలో తగ్గిన మానసిక సామర్థ్యం
- సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నారట
- కొత్త స్టడీలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి
ChatGPT Brain Study : అన్నింటా ఏఐదే ఆధిపత్యం.. ఏఐ లేకుండా ఇప్పుడు ఏ పనిచేయలేని పరిస్థితికి చేరుకున్నాం.. ఒకప్పుడు ఏఐ అంటేనే తెలియని వాళ్లంతా ఇప్పుడు అదే ఏఐతో అన్ని పనులుచకచకా పూర్తి చేసేస్తున్నారు. ఏఐతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువని ఓ కొత్త స్టడీలో తేలింది.
మీరు కూడా ప్రతిపనికి ఏఐపైనే ఆధారపడుతున్నారా? ఏఐతో ప్రతిదాన్ని తెగ వెతికేస్తున్నారా? అయితే, మీపై కూడా ఏఐ ప్రభావం పడినట్టే.. ఏఐ మన మెదడును పాడు చేస్తుందని తెలుసుకోలేకపోతున్నారా? మనం ఏం కోల్పోతున్నామో కూడా గ్రహించలేని స్థితికి చేరుకుంటున్నాం..
మనపై ఏఐ ప్రభావం ఎంత? :
ఏఐ ప్రపంచంలో చాట్‌జీపీటీ ఎంతో పవర్ ఫుల్.. ఎక్కువ శాతం మంది దీనిపైనే డిఫండ్ అవుతున్నారు.. చాట్‌జీపీటీ రాకతో (ChatGPT Brain Study) పనులన్నీ ఈజీ చేసింది. ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా, వ్యాసం రాయాలన్నా ఏదైనా కొత్త ఐడియా కావాలన్నా క్షణాల్లో ముందు ఉంచుతోంది. అయితే, అదేపనిగా ఏఐని వాడితే అది మన ఆలోచనా విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందా? 2025లో MIT పరిశోధకులు దీనిపై ఒక చిన్న స్టడీ చేశారు.. దాంతో ఈ ప్రశ్నకు మళ్లీ చర్చలోకి వచ్చింది.
3 గ్రూపులతో అధ్యయనం :
ఈ పరిశోధనలో 54 మంది పాల్గొన్నారు. అందులో వారిని 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక గ్రూపుచాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజీ మోడల్ వాడింది. మరో గ్రూపు సెర్చ్ ఇంజిన్ వాడింది. మూడో గ్రూపు ఎలాంటి బయటి టూల్ లేకుండా తమ సొంత ఆలోచనలతోనే వ్యాసాలు రాసింది. 4 నెలల వ్యవధిలో 3 సెషన్లలో ఈ పని కొనసాగింది. కొంతమందిని తర్వాత టూల్స్ మార్చి కూడా టెస్టింగ్ చేశారు.
ఇది నా సొంతం అనలేం :
రీసెర్చర్లు EEG ద్వారా మెదడు యాక్టివిటీని పరిశీలించారు. వ్యాసాల భాష, జ్ఞాపకశక్తి, రచనపై ఆసక్తి వంటి అంశాలను కూడా విశ్లేషించారు. చాట్ జీపీటీ వాడిన గ్రూపులో ఇతర గ్రూపులతో పోలిస్తే తక్కువ స్థాయి మెదడు కనెక్టివిటీ కనిపించింది. వారు రాసిన వ్యాసంలోని ముఖ్యమైన అంశాలను గుర్తు చేసుకోవడంలో కూడా ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. తమ రచనపై ‘ఇది నాది’ అనే భావన కూడా తక్కువగా కనిపించింది.
అన్ని సందర్భాల్లో కాదు :
అయితే, ఇక్కడ ముఖ్యమైన విషయం.. ఈ అధ్యయనం చిన్న మోడల్‌తో జరిగింది. ఇది ఇంకా పీర్ రివ్యూడ్ జర్నల్‌లో పబ్లీష్ చేయలేదు. ఎంఐటీ కూడా ఫలితాలను ప్రిలిమినరీగా జాగ్రత్తగా చూడాలని స్పష్టం చేసింది. పైగా ప్రధానంగా వ్యాస రచన సందర్భంలో జరిగిన రీసెర్చ్ మాత్రమే.. అందుకే చాట్ జీపీటీ వాడితే ప్రతి సందర్భంలోనూ మెదడు సామర్థ్యం తగ్గుతుందని చెప్పలేమంటున్నారు.
చివరిగా ఒక్కమాటలో చెప్పాలంటే.. చాట్ జీపీటీని పూర్తిగా దూరం పెట్టాలని కాదు.. ఏదైనా ఆన్సర్ కోసం ముందుగా మనం ఆలోచించాలి. ఆ తర్వాతే ఏఐపై ఆధారపడాలి. సొంతంగా ఆలోచించిన తర్వాత ఇంకా ఏదైనా లోతుగా తెలుసుకునేందుకు వాడాలి. ఇక్కడ ఏఐ అనేది కేవలం అసిస్టెంట్ మాత్రమే.. సాంకేతికత అనేది మన పనిని తగ్గించాలి కానీ, మన ఆలోచనను కాదని అందరూ గుర్తించుకోవాలి.
