PAN Card Misused : బిగ్ అలర్ట్.. మీ PAN కార్డు సేఫ్‌గా ఉందా? మీ పేరుతో ఫేక్ బ్యాంకు అకౌంట్ ఉందో లేదో జస్ట్ 2 నిమిషాల్లో తెలుసుకోవచ్చు!

PAN Card Misused : మీ పాన్ కార్డును మీకు తెలియకుండా ఎవరో వాడేస్తున్నారు తెలుసా? మీ పేరుతోనే ఫేక్ బ్యాంకు అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు.. ఇలా చేశారంటే జస్ట్ 2 నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు.

PAN Card Misused ( Image Credit Gemini AI )

  • మీ పాన్ కార్డుతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు జాగ్రత్త
  • పాన్ కార్డు దుర్వినియోగం అయిందని ఇలా తెలుసుకోవచ్చు
  • ఇలాంటి మెయిల్స్, ఎస్ఎంఎస్ పదేపదే వస్తున్నాయా?

PAN Card Misused : మీ పాన్ కార్డు ఎవరైనా వాడుతున్నారా? ఎప్పుడైనా మీకు ఇలాంటి అనుమానం వచ్చిందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేశారా? మీ పేరుతో ఏదైనా ఫేక్ బ్యాంకు అకౌంట్ ఉందో లేదో తెలుసుకోలేమా? అంటే కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ.

ప్రస్తుత రోజుల్లో బ్యాంకు అకౌంట్ ఎవరైనా నిమిషాల్లో ఓపెన్ చేయొచ్చు. మోసగాళ్లు కూడా ఇదే ప్రాసెస్ ద్వారా ఇతరుల పేరుతో ఫేక్ బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేస్తుంటారు. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే.. మీ పాన్ కార్డుతో ఎవరైనా ఫేక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారో లేదో తెలుసుకోవాలని ఉందా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Read Also : CIBIL Score 800 : మీ సిబిల్ స్కోరు ఇలా ఉందా..? మీరు వద్దన్నా బ్యాంకులు పిలిచి లోన్లు ఇస్తాయి.. అది కూడా తక్కువ వడ్డీకే..!

క్రెడిట్ రిపోర్ట్‌తో ఫస్ట్ చెక్ చేయండి :
మీ పాన్ కార్డుతో ఫేక్ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేశారు అనేది గుర్తించేందుకు క్రెడిట్ రిపోర్టు చెక్ చేయడం బెస్ట్ ఆప్షన్. ముందుగా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేయండి. మీ పేరు మీద బ్యాంకు ఖాతా లేదా లోన్ తీసుకుంటే ఆయా వివరాలు సిబిల్, ఎక్స్‌పీరియన్, లేదా ఈక్విఫాక్స్ వంటి ఏజెన్సీల రిపోర్టులలో కనిపిస్తాయి. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేయండి, మీకు తెలియని బ్యాంకు ఖాతా లేదా లోన్ కనిపిస్తే మీ పాన్ కార్డు పక్కగా దుర్వినియోగం అయినట్టే.

ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఏఐఎస్ :
మీ పాన్ కార్డుకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను చూసేందుకు మీరు ఆదాయపు పన్ను పోర్టల్‌లోకి లాగిన్ అవ్వవచ్చు. ఇక్కడ, మీ పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలు, వడ్డీ ఆదాయం, ప్రధాన లావాదేవీల గురించి సమాచారాన్ని వార్షిక సమాచార నివేదిక (AIS)లో కనిపిస్తుంది. ఇక్కడే మీరు మోసపూరిత అకౌంట్లను కూడా గుర్తించవచ్చు.

బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు తరచుగా ఇమెయిల్‌లు లేదా SMS వస్తుంటాయి. అందుకే ఈ ఇమెయిల్‌లు, SMSల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయిందని అనుమానిస్తే.. మీరు నేరుగా సంబంధిత బ్యాంకు నుంచి సమాచారాన్ని రిక్వెస్ట్ చేయొచ్చు.