Jio vs Airtel vs Vi : డేటా వద్దు.. ఫోన్ కాల్స్, SMS చాలు.. Jio, Airtel, Viలో చౌకైన కొత్త రీఛార్జ్ ఆప్షన్లు!
Jio vs Airtel vs Vi : తక్కువ వ్యాలిడిటీతో డేటా అక్కర్లేని కస్టమర్ల కోసం అతి త్వరలో సరసమైన రీఛార్జ్ ప్లాన్లను రాబోతున్నాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం వాయిస్, ఎస్ఎంఎస్ ఓన్లీ ఆప్షన్లను కూడా ఇకపై రీఛార్జ్ ప్లాన్లలలో అందించాల్సి ఉంటుంది.
Jio, Airtel, Vi
- వాయిస్, SMS మాత్రమే కావాలా? టెలికాం కంపెనీల కొత్త ప్లాన్స్
- డేటా అవసరం లేని వారికి భారీ ఊరట.. తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్లు?
- చౌకైన వాయిస్, SMS ప్లాన్స్ రానున్నాయా? ఎవరికి లాభం?
Jio vs Airtel vs Vi : మీకు డేటా అవసరం లేదా? జస్ట్ ఫోన్ కాల్స్, SMS బెనిఫిట్స్ ఉంటే చాలా? ఇకపై ఇలాంటి కస్టమర్లకు నిజంగా పండగే.. అతి త్వరలో అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురానుంది. మరిన్ని రీఛార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం కంపెనీలు వాయిస్ + SMS ఓన్లీ స్పెషల్ టారిఫ్ వోచర్లను (STVs) వివిధ టెన్యూర్లలో అందించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) వంటి కంపెనీల్లో డేటాతో బండిల్ ప్లాన్లు ఎక్కువగా లభిస్తున్నాయి. కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ అవసరమైన వారికి ప్రత్యేక ప్లాన్లు పరిమితంగా ఉన్నాయి. కొన్ని రీఛార్జ్ ప్లాన్లు ఎక్కువ వ్యాలిడిటీతో ఉన్నట్టుగా ట్రాయ్ గుర్తించింది. తద్వారా కస్టమర్ల అవసరానికి సరిపోయే తక్కువ టర్మ్ ప్లాన్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
కొత్త నిబంధనల ప్రకారం.. :
ఒక కంపెనీ 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీతో వాయిస్, SMS, డేటా ప్లాన్ అందిస్తే.. అదే కాలపరిమితితో వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండేలా ప్లాన్‌ను కూడా అందించాలి.
Read Also : Mivi One Smartphone : మివి నుంచి ఫస్ట్ 5G ఫోన్ వచ్చేసింది.. ధర జస్ట్ రూ. 15వేల లోపే.. ఫీచర్లు మాత్రం కేక..!
అలాగే నెలవారీ వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్‌కు ప్రతి నెలా అదే తేదీన రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండాలి. ఒకవేళ ఆ తేదీ నెలలో లేకుంటే నెల చివరి తేదీని రెన్యువల్ డేట్ గానే లెక్కించాలి. అంతేకాదు.. లాంగ్ వ్యాలిడిటీతో వాయిస్, ఎస్ఎంఎస్, డేటా స్పెషల్ టారిఫ్ వోచర్లు ఉంటే.. వాటికి అనుగుణంగా కనీసం ఒక లాంగర్ వ్యాలిడిటీ వాయిస్, ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్ కూడా ఉండాలి.
ట్రాయ్ ఏం చెప్పిందంటే? :
అయితే, ఇక్కడ కీలక విషయం ఏమిటంటే.. ట్రాయ్ కొత్త ప్లాన్లకు నిర్దిష్ట ధరను నిర్ణయించలేదు. రూ. 50, రూ. 100 వంటి ఫిక్స్డ్ ధరలకు ప్లాన్లు అందించాలని చెప్పలేదు. డేటా లేని వాయిస్ + SMS ప్లాన్లకు తగిన టారిఫ్ తగ్గింపు ఉండాలని మాత్రమే నిబంధనలు సూచిస్తున్నాయి.
తద్వారా జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు డేటా అవసరం లేకపోతే కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ కోసం తక్కువ వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, కొత్త ప్లాన్ల ధరలు, బెనిఫిట్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్నది ఆయా టెల్కో కంపెనీలు ప్రకటించాల్సి ఉంది.
