Jio Family Plan : కొత్త జియో ఫ్యామిలీ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో 4 సిమ్స్‌కు వాడుకోవచ్చు.. అన్లిమిటెడ్ కాలింగ్, 75GB డేటా, ఫ్రీ OTT బెనిఫిట్స్
Jio Family Plan : జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్యామిలీ ప్లాన్ అందిస్తోంది, సింగిల్ రీఛార్జ్‌లో 4 సిమ్‌లు బెనిఫిట్స్ పొందవచ్చు. 75GB హై-స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది.
Jio Family Plan
Jio Family Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన రీఛార్జ్ ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే కాకుండా పోస్ట్‌పెయిడ్ యూజర్లకు కూడా అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. సింగిల్ రీఛార్జ్‌లో ఒకేసారి 4 సిమ్‌లను వినియోగించుకోవచ్చు.
కస్టమర్ల కోసం జియో ఫ్యామిలీ ప్లాన్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ధర నెలకు రూ. 449 మాత్రమే. సింగిల్ రీఛార్జ్‌పై హై-స్పీడ్ డేటాను మాత్రమే కాకుండా ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఈ ఫ్యామిలీ ప్లాన్‌లో కంపెనీ ఏమి అందిస్తుందో నిశితంగా పరిశీలిద్దాం..
జియో రూ.449 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ :
ఈ జియో ప్లాన్ 75GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇందులో రూ.10జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS కూడా పొందవచ్చు. ఇంకా, వినియోగదారులు ఈ ప్లాన్‌కు 3 ఫ్యామిలీ సిమ్‌లను యాడ్ చేసుకోవచ్చు.
అంటే.. ప్రైమరీ సిమ్ కలిపి మొత్తం 4 సిమ్ల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ప్రతి అదనపు సిమ్‌కు 5GB అదనపు డేటాను పొందవచ్చు. అయితే, ఫ్యామిలీ సిమ్‌తో ప్రతి సిమ్‌కు నెలకు రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రీమియం, ఫ్రీ సబ్స్రిప్షన్లు :
జియో ఫ్యామిలీ ప్లాన్ డేటా, కాలింగ్ మాత్రమే కాదు.. అనేక ప్రీమియం సబ్స్క్రిప్షన్లను కూడా అందిస్తుంది. ఉదాహరణకు.. ఈ ప్లాన్ 3 నెలల పాటు ఫ్రీ జియో హాట్‌స్టార్ మొబైల్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
ఈ ప్లాన్‌లో నెల పాటు జియోసావన్ ప్రోకి ఫ్రీ సబ్స్క్రిప్షన్, 50GB ఫ్రీ స్టోరేజ్ కోసం జియోఏఐక్లౌడ్, 6 నెలల పాటు నెట్ మెడ్స్ ఫస్ట్ మెంబర్షిప్ కోసం నెట్ 3 నెలల పాటు జొమాటో గోల్డ్, దేశీయ విమానాలపై రూ. 2,220 వరకు డిస్కౌంట్, ఈజీమైట్రిప్ ద్వారా హోటళ్లపై 15శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అదనంగా, రిలయన్స్ డిజిటల్‌పై రూ. 399 తగ్గింపు పొందవచ్చు. అజియో (AJIO)పై రూ. 200 తగ్గింపు పొందవచ్చు. జియోహోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్ కూడా పొందవచ్చు. మీరు జియో 5G యూజర్ అయితే ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ 5G డేటా కూడా పొందవచ్చు.
