Jio Gemini Pro Offer : జియో యూజర్లకు బిగ్ అలర్ట్..! జెమిని ప్రో ఫ్రీ ఆఫర్ ఇక కొన్ని రోజులు మాత్రమే.. ఎలా పొందాలంటే?

Jio Gemini Pro Offer : జియో యూజర్ల కోసం గూగుల్ జెమిని ప్రో ఉచితంగా లభిస్తోంది. ఈ ఆఫర్ అతి త్వరలో ముగియనుంది. రూ. 35,100 ఖరీదైన జెమిని ప్రో ఉచితంగా 18 నెలలు ఎంజాయ్ చేయొచ్చు..

Jio Gemini Pro ( Image Credit : Gemini AI )

  • జియో యూజర్ల కోసం జెమిని ఫ్రీ ప్రో ఆఫర్
  • రూ. 35,100 ఖరీదైన ప్రో మోడల్ 18 నెలలు ఉచితం
  • ఈ ఆఫర్ ఎలా పొందాలి? ఎవరు అర్హులంటే?

Jio Gemini Pro Offer : రిలయన్స్ జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. జియో జెమిని ప్రో ఆఫర్‌ ఫ్రీగా వస్తోంది. మీరు ఇంకా ఈ ఆఫర్ వాడుకోలేదా? వెంటనే ఈ పనిచేయండి. ఎందుకంటే.. జియో జెమిని ప్రో ఆఫర్ అతి త్వరలో ముగియబోతోంది.

మీరు ఈ లిమిటెడ్ టైమ్ డీల్‌ను అసలు మిస్ చేసుకోవద్దు. అక్టోబర్ 2025లో ప్రకటించిన రిలయన్స్ జియో, గూగుల్ జెమిని భాగస్వామ్యం (Jio Gemini Pro Offer) సుమారు 50 కోట్ల జియో యూజర్లకు జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా అందించింది.

ఇంతకుముందు ఈ ఆఫర్ 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సు గల యూజర్లకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు జియో జెమిని ప్రో ఆఫర్ అందరికీ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జియో జెమిని ప్రో ఆఫర్ ఏంటి? :
జియో జెమిని ప్రో ఆఫర్ అనేది 18 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు రూ.349 లేదా ఆపై ఎక్కువ వాల్యూ ఉండే యాక్టివ్ జియో అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లో ఉన్న జియో సిమ్ యూజర్లకు అందించే స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. తద్వారా రూ. 35,100 విలువైన జెమిని ప్రో ఏఐ టూల్ ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.

జియో జెమిని ప్రో బెనిఫిట్స్ ఏంటి? :
డీప్ రీసెర్చ్, వీడియో జనరేషన్‌తో జెమిని మోడల్‌కు ఎక్కువ యాక్సస్ పొందొచ్చు. ఇమేజ్, ఇమేజ్-టు-వీడియో లిమిట్స్, గూగుల్ యాప్‌లలో 5TB స్టోరేజ్, అడ్వాన్స్ ఏఐ ఫిల్మ్‌మేకింగ్ టూల్స్, జెమిని కోడ్ అసిస్ట్, CLIలో హైయర్ లిమిట్స్, విస్తరించిన NotebookLM ఫీచర్లు, Gmail, Docs ఇంకా మరిన్నింటిలో జెమిని ఇంటిగ్రేషన్ కూడా ఉంది.

Read Also : Moto G37 Series : మోటోరోలా నుంచి రెండు కొత్త 5G ఫోన్లు.. మే 19నే లాంచ్.. ఫ్లిప్‌కార్ట్‌లోనే ఫస్ట్ సేల్..!

జియో యూజర్లకు జెమిని ప్రో ఫ్రీ ఆఫర్ :
18 ఏళ్లు పైబడిన జియో రిటైల్ యూజర్లు యాక్టివ్ రూ.349 లేదా ఆపై ఎక్కువ అన్ లిమిటెడ్ 5G ప్లాన్‌లో ఉన్నవారు, గూగుల్ జెమిని బెనిఫిట్స్ పొందాలంటే అదే రీఛార్జ్ కొనసాగించాలి.

జియో జెమిని ప్రో రీఛార్జ్ ప్లాన్ల లిస్టు :
రూ.349, రూ.399, రూ.445, రూ.450, రూ.459, రూ.500, రూ.449, రూ.629, రూ.719, రూ.749, రూ.859, రూ.899, రూ.949, రూ.999, రూ.1028, రూ.1029, రూ.1049, రూ.1199, రూ.1299, రూ.1799, రూ.3599, రూ.2025, రూ.3999

జియో జెమిని ప్రో ఆఫర్ లాస్ట్ డేట్ :
జియో జెమిని ప్రో ఆఫర్ గడువు తేదీ 29 అక్టోబర్ 2026 వరకు ఉంది. అధికారిక జియో జెమిని ప్రో ఆఫర్ నిబంధనలు, షరతుల ప్రకారం.. రిలయన్స్ జియో, జెమిని ప్రో ఆఫర్ 30 అక్టోబర్ 2025 నుంచి ప్రారంభమై 29 అక్టోబర్ 2026 వరకు లేదంటే జియో నిర్ణయించే ఆఫర్ వ్యవధి వరకు అందుబాటులో ఉంటుంది.

అంతేకాదు.. 11 ఫిబ్రవరి 2026 నుంచి ఆఫర్‌ క్లెయిమ్ చేసుకునే వారంతా 18 ఏళ్లు పైబడినవారు అయితేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో పేర్కొంది. అయితే, ఈ ఆఫర్ అర్హత ఉంటే రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ధర యాక్టివ్ 1.5GB/రోజు ప్లాన్‌లలో ఉండాలి. సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో RJIL సర్వీసుల కోసం రూ. 299 లేదా ఆపై ఎక్కువ 1.5GB/రోజు రీఛార్జ్ ప్లాన్‌పై యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌గా ఉండాలి.