Jio Recharge Plan : జియో సూపర్ చీపెస్ట్ ప్లాన్..! జస్ట్ రూ.200లో 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా

Jio Recharge Plan : లక్షలాది జియో యూజర్ల కోసం 28 రోజుల వ్యాలిడిటీతో తక్కువ ధరకే అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తోంది. ఈ సరసమైన ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్‌తో సహా అనేక డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

Jio Recharge Plan ( Illustration generated using AI )

  • జియో యూజర్ల కోసం అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్
  • రూ. 200 కన్నా తక్కువ ధరలో 28 వ్యాలిడిటీ ఆఫర్
  • ఓటీటీ యాప్స్‌కు ఫ్రీ యాక్సస్, 300 ఫ్రీ SMS బెనిఫిట్స్

Jio Recharge Plan : రిలయన్స్ జియో యూజర్లకు అద్భుతమైన ప్లాన్.. అత్యంత చౌకైన ధరకే జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు.

జియో అనేక రీఛార్జ్ ప్లాన్‌లతో OTT యాప్‌లకు ఫ్రీ యాక్సెస్‌ అందిస్తుంది. జియోలో (Jio Recharge Plan) రూ. 200 లోపు ధరలో సరసమైన ప్లాన్ ఇదొకటి. జియో యూజర్లు దేశమంతటా అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

చౌకైన నెలవారీ ప్లాన్ :
రిలయన్స్ జియో నుంచి ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కంపెనీ ఈ ప్లాన్‌ ‘వాల్యూ ప్లాన్’ కింద అందిస్తోంది. జియో ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి.

దేశమంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు 300 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇందులో మొత్తం వ్యాలిడిటీతో వాడుకోవచ్చు. కాంప్లిమెంటరీ ద్వారా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌కు కూడా యాక్సస్ చేయొచ్చు.

Read Also : HMD Vibe 2 5G : రూ. 10వేల కన్నా తక్కువకే నోకియా 5G ఫోన్.. ఇండియాలో బడ్జెట్ సెన్సేషన్!

జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 2GB హై-స్పీడ్ డేటా అందిస్తోంది. రోజువారీ లిమిటెడ్ లేకుండా ఈ డేటాను ప్లాన్ మొత్తం వ్యాలిడిటీకి వాడుకోవచ్చు. తక్కువ ఇంటర్నెట్ వాడే యూజర్లకు ఈ ప్లాన్‌ అద్భుతంగా ఉంటుంది. మీరు జియో నంబర్‌ సెకండరీ సిమ్‌గా వాడుతుంటే మాత్రం నెలంతా ఎంజాయ్ చేయొచ్చు.

రూ. 200 కన్నా తక్కువే :
జియో ప్లాన్ ధర రూ. 189 మాత్రమే. రోజుకు రూ. 7 కన్నా తక్కువకే అన్ లిమిటెడ్ కాలింగ్ డేటా పొందవచ్చు. ఇతర ప్లాన్‌లతో కంపేర్ చేస్తే.. జియో రూ. 199 ప్లాన్‌లో పూర్తి 14 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్‌ అందిస్తుంది. వినియోగదారులు రోజువారీ 1.5GB డేటా 100 ఉచిత SMS కూడా పొందవచ్చు.