JioBharat 4G : జియో భారీ ఆఫర్.. రూ. 1,499 జియోభారత్ 4G ఫోన్.. జస్ట్ రూ. 299కే.. 6 నెలలు ఫ్రీ రీఛార్జ్ ఆఫర్..!

JioBharat 4G : జియో ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్నారా? జియోభారత్ 4జీపై జియో స్పెషల్ జియో వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. పూర్తి ఆఫర్, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే?

  • Published on- September 30, 2026 / 07:58 PM IST

Jio offers JioBharat 4G phones

  • జియోభారత్ 4G 2.4 అంగుళాల డిస్‌ప్లే ఉంది
  • జియోభారత్ 4G 2000mAh బ్యాటరీతో వస్తుంది
  • 500కుపైగా టీవీ ఛానెళ్లకు యాక్సెస్ అందిస్తుంది

JioBharat 4G : జియో కస్టమర్లకు పండగే.. స్పెషల్ జియో వార్షికోత్సవ ఆఫర్‌ను జియోభారత్‌పై అందిస్తోంది. ఫీచర్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లకు మరిన్ని బెనిఫిట్స్ అందించనుంది.

తక్కువ ధరకే 4జీ కనెక్టివిటీని అందిస్తూ జియో ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను అందిస్తోంది. తద్వారా మరింత ఎక్కువ మంది భారతీయ కస్టమర్లకు డిజిటల్ లైఫ్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ జియో ఆఫర్‌ను మరింత వివరంగా ఇప్పుడు పరిశీలిద్దాం..

ఆఫర్‌లో ఏముంది? :
ఈ ఆఫర్ కింద జియోభారత్ 4జీ ఫోన్ రూ. 1,499కే లభిస్తుంది. అలాగే 6 నెలల ఫ్రీ రీఛార్జ్ బెనిఫిట్స్, నెలకు 14GB డేటా, అన్ లిమిటెడ్ HD వాయిస్ కాలింగ్ కూడా పొందవచ్చు.

2జీ కస్టమర్లకు అప్‌గ్రేడ్ ఛాన్స్ :
సాధారణంగా 2G కస్టమర్లు కనెక్టివిటీ కోసం ప్రతి నెలా సుమారు రూ. 199 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం కనెక్టివిటీ కోసమే 6 నెలల్లో దాదాపు రూ. 1,200 ఖర్చు చేయాలి.

Read Also : iQOO Pad Ultra Price : భారీ బ్యాటరీతో ఐక్యూ ప్యాడ్ అల్ట్రా వచ్చేసింది.. గేమింగ్ లవర్స్ కోసం అదిరిపోయే ఫీచర్లు!

జియో వార్షికోత్సవ ఆఫర్‌తో కస్టమర్లు కేవలం రూ. 1,499 చెల్లించి 4G జియోభారత్ ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు. 6 నెలల కనెక్టివిటీ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. తద్వారా కేవలం రూ. 299కే 2జీ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

జియోభారత్ 4G ఫీచర్లు :
జియోభారత్ 4జీ ఫోన్ 2.4 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో 4జీ కనెక్టివిటీతో పాటు 2000mAh బ్యాటరీ కూడా ఉంది. జియోభారత్ 4జీ సాధారణ 2G ఫీచర్ ఫోన్‌ల మాదిరిగా కాలింగ్, మెసేజింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఫుల్ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను కూడా అందిస్తుంది.

ఎంటర్‌టైన్మెంట్ కోసం జియో ఫోన్ జియో టీవీ ద్వారా 500కు పైగా టీవీ ఛానెళ్లకు యాక్సెస్ అందిస్తుంది. తద్వారా జియోహాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్, సినిమాలు చూడొచ్చు. అంతేకాదు.. లక్షలాది పాటలు, మ్యూజిక్ కంటెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్ పేమెంట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. జియోపే ద్వారా యూపీఐ పేమెంట్లు ఈజీగా చేయొచ్చు. పేమెంట్ అలర్ట్స్, సౌండ్ బాక్స్ ఫంక్షనాలిటీని కూడా అందిస్తుంది. సేఫ్టీ, ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ కోసం లొకేషన్ మానిటరింగ్, జియో సేఫ్టీ షీల్డ్ వంటి సేఫ్ కాలింగ్ ఫీచర్లను అందిస్తుంది.