Jio Rechage Plan : జియో యూజర్లకు పండగే.. 912GB ఫ్రీ డేటా, 5G అన్‌లిమిటెడ్ కాలింగ్.. 365 రోజులు జెమిని ప్రో ఏఐ ఫ్రీ..

Jio Rechage Plan : రిలయన్స్ జియో ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో లాంగ్ వ్యాలిడిటీతో స్పెషల్ ప్లాన్‌లను అందిస్తుంది. సింగిల్ రీఛార్జ్‌తో 365 రోజులు ఫ్రీగా జెమిని ప్రో ఏఐ ఎంజాయ్ చేయొచ్చు.

Jio Rechage Plan ( Image Credit : AI )

  • ఈ జియో ప్లాన్ రోజువారీగా 2.5GB డేటా అందిస్తుంది
  • ఈ ప్లాన్‌తో మొత్తం 912.5GB డేటా పొందవచ్చు
  • అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, SMS బెనిఫిట్స్

Jio Rechage Plan : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో స్పెషల్ లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లు యూజర్లకు తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తాయి.

ఈ ప్లాన్‌లు పూర్తి ఏడాది వ్యాలిడిటీ, డేటా, ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ 5G సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్‌తో పాటు అనేక ఫ్రీ బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. జియో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..

Read Also : Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ. 12వేలు ఆదా.. ఇప్పుడు కొనాలా? వద్దా?

జియో రూ. 3599 ప్లాన్ :
జియో 365 రోజుల వ్యాలిడిటీతో రూ. 3599 ప్రారంభ ప్లాన్‌ అందిస్తోంది. ఈ ప్లాన్ రోజువారీగా 2.5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కంపెనీ మొత్తం 912.5GB డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, SMS బెనిఫిట్స్ ఉన్నాయి. హై-స్పీడ్ డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ మెసేజ్ కూడా అందిస్తుంది.

ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్‌కు 3 నెలల మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఫ్రీగా గూగుల్ జెమిని ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌కు జియోటీవీ, జియోక్లౌడ్ వంటి యాప్‌లకు కూడా సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. జియోటీవీ ద్వారా యాప్‌లో 365 రోజుల పాటు వివిధ టీవీ షోలను ఎంజాయ్ చేయొచ్చు. జియో ప్లాన్‌తో లభించే జియోక్లౌడ్, అదనపు స్టోరేజ్ ఆప్షన్ అందిస్తుంది.

50GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. ఇందుకోసం రూ. 349 ప్లాన్ లేదా ఏదైనా అన్ లిమిటెడ్ 5G ప్లాన్ తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలి.