Jio vs Airtel : జియో vs ఎయిర్టెల్.. ఒకే రూ. 899 ప్లాన్.. వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్.. ఎందులో బెటర్? ఫుల్ డిటెయిల్స్!
Jio vs Airtel : జియో, ఎయిర్ టెల్ పోటీపడి ఒకే ధరలో రూ. 899కే సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నాయి. ధర ఒకటే అయినా ప్లాన్ డేటా, వ్యాలిడిటీ, బెనిఫిట్స్ వేరేలా ఉన్నాయి. ఈ రెండు ప్లాన్లలో ఏది తీసుకుంటే బెటర్?
Jio vs Airtel
- జియో 90 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అదనంగా 20GB బోనస్ డేటా
- ఎయిర్టెల్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5GB డేటా, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే OTT యాక్సెస్
- ఎక్కువ డేటా వాడేవారికి జియో బెస్ట్, ఎంటర్మైనెంట్ కోసం ఎయిర్టెల్ బెటర్
Jio vs Airtel : ఎయిర్టెల్, రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. మంచి ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ కోసం చూస్తున్నారా? రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ రెండూ రూ. 899కే అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి.
ఎయిర్టెల్ ఇటీవలే రూ. 799 ప్లాన్ రూ. 899కి మార్చేసింది. కానీ, ఒకే ధర అంటే (Jio vs Airtel)ఒకే రకమైన బెనిఫిట్స్ ఉంటాయని కాదు. డేటా, వ్యాలిడిటీ, రోజువారీ వినియోగ లిమిట్స్ ఉంటాయి. ఎక్కువ వాడేవారు, తక్కువ వాడేవారు ఇలా వేర్వేరు ప్లాన్లను ఎంచుకోవచ్చు. డేటా, SMS, వ్యాలిడిటీ పరంగా ప్రతి ప్లాన్ ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ :
లాంగ్ టైమ్ కనెక్షన్, హై డేటా కోరుకునే యూజర్లకు జియో రూ. 899 ప్లాన్ బాగుంటుంది. 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. సుమారుగా 3 నెలలు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లాన్ కింద మీకు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ప్రత్యేక బోనస్‌గా.. రోజువారీ డేటా లిమిట్ ముగియగానే జియో అదనంగా 20GB డేటాను అందిస్తుంది.
చాలా జియో ప్లాన్ల మాదిరిగానే మీకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ లభిస్తాయి. మీకు జియోటీవీ, జియోక్లౌడ్, జియోసినిమాతో సహా జియో యాప్‌లకు కూడా యాక్సెస్ పొందవచ్చు. మీ దగ్గర 5G నెట్వర్క్ ఫోన్ ఉంటే ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ 5G డేటా కూడా పొందవచ్చు.
Read Also : Gold Price Today : గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో సడన్ ట్విస్ట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!
ఎయిర్టెల్ రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్టెల్ రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంతేకాదు.. రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
తద్వారా 20కి పైగా విభిన్న OTT ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయవచ్చు. మీకు అపోలో 24/7 సర్కిల్, ఫ్రీ హలోట్యూన్స్ వంటి రివార్డులు కూడా లభిస్తాయి. జియో మాదిరిగానే ఎయిర్టెల్ కూడా 5G నెట్వర్క్ కవరేజ్‌లో అన్ లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది.
జియో వర్సెస్ ఎయిర్టెల్ రూ. 899 ప్లాన్ ఏది బెటర్? :
డేటా కావాలా? కంటెంట్ కావాలా? మీకు ఏది కావాలి? అనేదానిపై ఏ ప్లాన్ బెటర్ అనేది తెలుస్తుంది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలంటే జియో రూ. 899 ప్లాన్ ఎంచుకోవచ్చు. 6 అదనపు రోజుల వ్యాలిడిటీ, రోజువారీ 0.5GB అదనపు డేటా, 20GB బోనస్ కూడా లభిస్తుంది.
ఇంటర్నెట్ను ఎక్కువగా వాడే యూజర్లకు బెస్ట్ ఆప్షన్. మీరు మూవీలు, టీవీలు చూసేవారైతే ఎయిర్టెల్ రూ. 899 ప్లాన్ బెటర్. జియో స్టాండర్డ్ ప్లాన్‌లో లేని విధంగా ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ అద్భుతమైన ఆప్షన్లను అందిస్తుంది.
