Gold Price Today : గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో సడన్ ట్విస్ట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!
Gold Price Today April 21 : బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధర భారీగా తగ్గింది. ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today April 21 : బంగారం కొనేవారికి పండగే.. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. పసిడి ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా వెండి ధరలు మాత్రం ఏకంగా 5వేలు తగ్గింది. ఏప్రిల్ 21 మంగళవారం నాడు దేశీయ ప్రధాన నగరాలతో పాటు ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,290 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,42,350 వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం బంగారం ధరలు కూడా ఇలానే ఉన్నాయి.

విజయవాడలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,290 వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,42,350 వద్ద కొనసాగుతోంది.

విశాఖలో ఈరోజు గోల్డ్ ధరలన పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,290 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 పెరిగి రూ.1,42,350 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,440 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,42,500 వద్ద ట్రేడ్ అవుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,43,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.220 పెరిగి రూ.1,55,290 దగ్గర కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 పెరిగి రూ.1,42,350 వద్ద పలుకుతోంది.

బెంగళూరులో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.220 పెరిగి రూ.1,55,290 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,42,350 వద్ద ట్రేడ్ అవుతోంది.

మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే.. ఈరోజు వెండి ధరలు ఏకంగా రూ. 5వేలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖలో రూ. 2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో రూ. 10వేలు తగ్గి రూ. 2,65,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
