Jio vs Airtel : ఒకే ధర.. 30 రోజుల వ్యాలిడిటీ! జియో, ఎయిర్‌టెల్‌లో బెనిఫిట్స్ ఒకటేనా? ఏది బెటర్?
Jio vs Airtel : రిలయన్స్ జియో 30 రోజుల ప్లాన్ ధర రూ. 355 ఉండగా ఎయిర్‌టెల్ ప్లాన్ కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లు డేటా, కాలింగ్, SMS, అలాగే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- July 18, 2026 / 07:21 PM IST
Jio vs Airtel
Jio vs Airtel : మీరు జియో లేదా ఎయిర్‌టెల్ యూజరా? మీ దగ్గర ఏ సిమ్ కార్డు ఉన్నా సరే.. ఈసారి రీఛార్జ్ చేసే ముందు కాస్త ఆగండి.. 30 రోజుల వ్యాలిడిటీతో ఏ కంపెనీ అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుందో ఫస్ట్ తెలుసుకోండి.
రిలయన్స్ జియో అత్యంత చౌకైన 30-రోజుల ప్లాన్ ధర రూ. 355కు అందిస్తోంది. ఇందులో డేటా, కాలింగ్, SMS, అదనపు బెనిఫిట్స్ (Jio vs Airtel) పొందవచ్చు. మరోవైపు, ఎయిర్‌టెల్ కూడా అత్యంత చౌకైన 30-రోజుల ప్లాన్ అదే ధర రూ. 355కు ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ఏయే బెనిఫిట్స్ అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జియో రూ. 355 ప్లాన్ :
రూ. 355తో రిలయన్స్ జియో మీకు మొత్తం 25GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ప్లాన్‌తో కంపెనీ 3 నెలల జియో హాట్‌స్టార్ మొబైల్, ఫ్రీ జియో క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్, 5000GB క్లౌడ్ స్టోరేజ్, నానో బనానా బెనిఫిట్స్ సహా అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
ఎయిర్‌టెల్ 355 ప్లాన్ బెనిఫిట్స్ :
ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో కంపెనీ మొత్తం 25GB హై-స్పీడ్ డేటా అందిస్తుంది. 300 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్.. రూ. 5 విలువైన టాక్ టైమ్‌ను కూడా అందిస్తుంది.
ఈ ప్లాన్ అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. అందులో రూ. 4వేల విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం (12 నెలల వ్యాలిడిటీ), రియల్-టైమ్ స్పామ్ కాల్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, ప్రతి 30 రోజులకు ఒకసారి ఫ్రీ హలోట్యూన్ ఉన్నాయి.
ఈ రెండు ప్లాన్‌ల మధ్య అతిపెద్ద తేడా SMS మాత్రమే ఉంది. జియో రోజువారీ ఎస్ఎంఎస్ అందిస్తుండగా, ఎయిర్‌టెల్ మొత్తం 300 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. అంతేకాదు.. జియో టాక్ టైమ్ కూడా అందించదు. కానీ, ఎయిర్‌టెల్ అందిస్తుంది. ఇందులో మీకు ఏది బెటర్ అనేది మీదే ఛాయిస్..
