Jio vs Vi VIP Number : మీకు VIP మొబైల్ నంబర్ కావాలా? జియో, Vi యూజర్లు ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్..!
Jio vs Vi VIP Number : VIP నంబర్ కావాలా? టెలికాం కంపెనీ స్టోర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుంచే ఈజీగా మీకు కావలసిన మొబైల్ నంబర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే?
- Sreehari A
- Published on- August 21, 2026 / 03:20 PM IST
Jio vs Vi VIP Number
- జియో, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు పండగే
- కొత్త వీఐపీ నెంబర్ల కావాలంటే ఇలా చేయండి
- వీఐ నెంబర్ కోసం ఎంత ఖర్చు చేయాలంటే?
Jio vs Vi VIP Number : జియో, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. మీరు కొత్త వీఐపీ మొబైల్ నంబర్ కోసం చూస్తున్నారా? అయితే, జియో, వోడాఫోన్ ఐడియా మీకు అద్భుతమైన అవకాశం అందిస్తున్నాయి.
మీరు వీఐపీ నంబర్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఇందుకోసం మీరు రూ. 50 నుంచి రూ.12వేల వరకు ఖర్చు కావచ్చు. మీరు టెలికాం కంపెనీ స్టోర్‌కు వెళ్లాల్సిన పనిలేదు. మీ ఇంటి నుంచే మీకు ఇష్టమైన వీఐపీ నంబర్‌ను ఈజీగా సొంతం చేసుకోవచ్చు.
జియో VIP ఫోన్ నంబర్లు :
మీరు జియో వీఐపీ మొబైల్ నంబర్ కోసం చూస్తుంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో మై జియో యాప్‌ను ఇన్‌స్టాల్ (Jio vs Vi VIP Number) చేయాలి. అవసరమైన ప్రాసెస్ పూర్తి చేసి వీఐపీ నంబర్ మీ ఇంటికి వస్తుంది.
- మై జియో (My Jio) యాప్ ఇన్‌స్టాల్ చేయాలి
- ఈ కింది క్విక్ లింక్‌లపై ట్యాప్ చేయాలి.
- ఆ తర్వాత మ్యాచింగ్ నంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు ఇష్టమైన సంఖ్యను సెర్చ్ చేయొచ్చు
- మీకు వీఐపీ నంబర్ల లిస్టు కనిపిస్తుంది.
- అందులో ఏదైనా VIP నంబర్ ఎంచుకోవచ్చు.
- వీఐపీ నంబర్ దొరక్కపోతే ‘Are You Looking For VIP Number’’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- నెంబర్ బుక్ చేశాక జియో రిప్రజెంటేటివ్ మీకు నచ్చిన VIP నెంబర్‌ను మీ ఇంటికి తెచ్చి ఇస్తాడు
Vi VIP నెంబర్లు :
మీరు వోడాఫోన్-ఐడియా VIP నంబర్ కోసం మీ ఫోన్‌లో MyVi యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
- యాప్ ఇన్‌స్టాల్ చేశాక VIP నంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీకు కావాల్సిన సంఖ్యను బాక్స్‌లో రిజిస్టర్ చేయండి.
- ఆ నంబర్ ఉంటే మీకు ఫ్రీ, ప్రీమియం VIP ఆప్షన్ లభిస్తుంది.
- లిస్టు కూడా కనిపిస్తుంది. మీకు ఇష్టమైన నెంబర్ సిరీస్ ఎంచుకోండి.
- మీ పిన్‌కోడ్ నంబర్ ఎంటర్ చేసి డెలివరీ అడ్రస్ రిజిస్టర్ చేయండి.
- కంపెనీ ప్రతినిధి మీరు బుక్ చేసుకున్న నంబర్‌ను మీ ఇంటికి డెలివరీ చేస్తారు
ఖర్చు ఎంతంటే? :
మీరు ఎంచుకున్న VIP నంబర్ ప్రీమియం కాదా? సిమ్ కార్డు కోసం రూ. 50 నామమాత్రపు రుసుము చెల్లించాలి. ఒకవేళ ప్రీమియం నంబర్ అయితే, మీకు రూ. 12వేల వరకు ఖర్చు కావచ్చు. ఆ తర్వాత నంబర్‌ను యాక్టివేట్ కోసం ఒక FRC (ఫస్ట్ రీఛార్జ్) ప్లాన్ ఎంచుకోవాలి.
