JioFiber Festival Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ( JioFiber Festival Bonanza) ఆఫర్‌ను ప్రకటించింది. జియో వినియోగదారులకు రూ.6,500 విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది. టెలికాం దిగ్గజం రిలయన్స్ డిజిటల్, AJIO, ఇతర సర్వీసులకు గిఫ్ట్ వోచర్లను (రూ. 6,500 వరకు) అందిస్తోంది. ఆఫర్లో 4K JioFiber సెట్ టాప్ బాక్స్ ఉచితంగా 100 శాతం ‘Value Back’ స్కీమ్ కూడా ఉంది.
ఈ కొత్త పండుగ ఆఫర్ అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 28 మధ్య మాత్రమే అందుబాటులో ఉంటుంది. JioFiber అందించే డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022 కింద కొత్త JioFiber కనెక్షన్‌ని బుక్ చేసుకోవచ్చు. 6 నెలల వ్యాలిడిటీతో రూ. 599 లేదా రూ. 899 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఇతర ప్లాన్ బెనిఫిట్స్‌తో పాటు రెండు అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. వీటిలో 100 శాతం ‘Value Back’ 15 రోజుల అదనపు వ్యాలిడిటీ ఉన్నాయి. మరో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై ఆఫర్ కూడా అందిస్తోంది.
* రూ. 599 JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ (6 నెలల ప్లాన్) కింద కొత్తగా కొనుగోలు చేసినట్లయితే.. మీకు రూ. 4,500 విలువైన వోచర్లను అందిస్తుంది.
* AJIO రూ. 1,000 వోచర్, రిలయన్స్ డిజిటల్ రూ. 1,000 వోచర్, నెట్‌మెడ్స్ రూ. 1,000 వోచర్, IXIGO రూ. 1,500 వోచర్‌తో సహా 4 విభిన్న బ్రాండ్ల వోచర్లు ఉన్నాయి.
* ప్లాన్‌లో భాగమైన 6 నెలల వ్యాలిడిటీతో పాటు 15 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా ప్లాన్ సపోర్ట్ చేస్తుంది.
* ఇది Jio నుంచి 30Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్, ఇందులో 14+ OTT యాప్‌లు, 550+ ఆన్-డిమాండ్ ఛానెల్‌లకు యాక్సెస్ అందిస్తుంది.
* రూ. 899 JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ (6 నెలల ప్లాన్) రూ. 6,500 విలువైన వోచర్లను అందిస్తుంది.
* వీటిలో AJIO రూ. 2వేల వోచర్, రిలయన్స్ డిజిటల్ రూ. 1,000 వోచర్, NetMeds రూ. 500 వోచర్, IXIGO రూ. 3వేల వోచర్ ఉన్నాయి.
అదనంగా, ఈ కస్టమర్లందరూ ఈ ప్యాక్‌తో 15 రోజుల అదనపు వ్యాలిడిటీని పొందవచ్చు. అదనంగా ప్లాన్‌లో భాగమైన 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ బెనిఫిట్స్‌తో పాటు 100Mbps స్పీడ్, 14+ OTT యాప్‌లు, 550+ ఆన్-డిమాండ్ ఛానెల్‌లను కూడా పొందుతారు.
* రూ. 899 (3-నెలల ప్యాక్) JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కొనుగోలు చేసే వారికి నాలుగు వేర్వేరు బ్రాండ్ల వోచర్లు లభిస్తాయి.
* వీటిలో AJIO రూ. 1,000 వోచర్, రిలయన్స్ డిజిటల్ రూ. 500 వోచర్, NetMeds రూ. 500 వోచర్, IXIGO రూ. 1,500 వోచర్ ఉన్నాయి.
* ఈ ప్లాన్‌పై అదనపు పేమెంట్ వర్తించదని గమనించాలి.
* ఈ ప్లాన్‌లోని కొత్త కస్టమర్లు మొత్తం రూ. 3,500 వోచర్లను పొందుతున్నారు.
* ఈ ప్లాన్ 100Mbps స్పీడ్‌తో వస్తుంది. 14+ OTT యాప్‌లతో పాటు 550 కన్నా ఎక్కువ ఆన్-డిమాండ్ ఛానెల్‌లకు ఉచిత యాక్సెస్) ‘వాల్యూ బ్యాక్’ ఆఫర్ ఈ ప్లాన్‌పై మాత్రమే వర్తిస్తుంది.
Note : జియోఫైబర్ అందించే ప్లాన్లలో ఏదైనా కొనుగోలు చేసే కస్టమర్లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రూ. 6వేల విలువైన ఉచిత 4K JioFiber సెట్-టాప్ బాక్స్‌ను పొందడానికి అర్హులు. పైన పేర్కొన్న ప్లాన్లపై అందుబాటులో ఉండే GST ఛార్జీలను కూడా యూజర్లు చెల్లించాల్సి ఉంటుంది. లేటెస్ట్ JioFiber ఆఫర్ కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇళ్లలో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు లేని వారు JioFiber కొనుగోలు చేయాలనుకునే వారు అన్ని ఆఫర్లను పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : JioFiber Plans : జియోఫైబర్ 6 కొత్త ప్లాన్లు ఇవే.. జీరో ఫీజు ఇన్స్టాలేషన్..!