JioPhone Prima Plans : జియోఫోన్ ప్రైమా 4జీ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఏ ప్లాన్ ధర ఎంతంటే? పూర్తి లిస్టు మీకోసం..!

JioPhone Prima Plans : జియోఫోన్ ప్రైమా యూజర్ల కోసం సరికొత్త 4జీ ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ల కింద రోజువారీ డేటాతో పాటు మరిన్నో ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఓసారి అవేంటో ఓసారి లుక్కేయండి.

JioPhone Prima all 4G Prepaid Plans Listed and Explained

JioPhone Prima Plans : మీరు జియోఫోన్ ప్రైమా యూజర్లా? అయితే మీకోసం అద్భుతమైన 4జీ ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే రియలన్స్ జియో నుంచి భారతీయ మార్కెట్లోకి జియోఫోన్ ప్రైమా కొత్త 4జీ ఫోన్ లాంచ్ అయింది. IMC (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 2023లో ఈ ఫోన్ ఆవిష్కరించింది.

ఆ తరువాత నవంబర్ ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చింది. కానీ, జియోఫోన్ ప్రైమా జియోఫోన్ మాదిరిగా ఉండదు. ఇందులోని ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. మీరు జియోఫోన్ ప్రైమా యూజర్లు అయితే జియోఫోన్ ప్లాన్‌తో రీఛార్జ్ చేయలేరు. భారత అతిపెద్ద టెలికాం రిలయన్స్ జియో జియోఫోన్ ప్రైమా వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను రిలీజ్ చేసింది. ఇందులో జియోఫోన్ ప్రైమా 4జీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఓసారి పరిశీలించండి.

జియోఫోన్ ప్రైమా 4జీ ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
ప్రస్తుతం మొత్తం ఏడు జియోఫోన్ ప్రైమా 4జీ ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ధర వరుసగా రూ. 75, రూ. 91, రూ. 125, రూ. 152, రూ. 186, రూ. 223, రూ. 895 ఉన్నాయి. ఈ ప్లాన్‌లన్నీ డేటా బెనిఫిట్స్ అందిస్తాయి.

రూ.75 ప్లాన్ :
ఈ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. 100ఎంపీ రోజువారీ డేటా + 200ఎంపీ డేటాతో వస్తుంది. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 50ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి.

Read Also : Jio Cloud Laptop : రిలయన్స్ జియో ‘క్లౌడ్’ ల్యాప్‌టాప్ వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

రూ.91 ప్లాన్ :
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 100ఎంపీ డేటా + 200ఎంపీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 50ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. వినియోగదారులు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ కూడా పొందవచ్చు.

రూ.125 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300ఎస్ఎంఎస్‌లతో పాటు రోజువారీ 0.5జీబీ డేటాతో వస్తుంది. వినియోగదారులు జియోక్లౌడ్, జియోసినిమా, జియోటీవీని పొందవచ్చు.

JioPhone Prima all 4G Prepaid Plans

రూ. 152 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో, వినియోగదారులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300ఎస్ఎంఎస్‌లు, 0.5జీబీ రోజువారీ డేటాను పొందవచ్చు. జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ 28 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.

రూ. 186 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో 1జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100ఎస్ఎంఎస్/రోజు వస్తుంది. వినియోగదారులు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ 28 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.

రూ. 223 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో 2జీబీ రోజువారీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100ఎస్ఎంఎస్/రోజు వస్తుంది. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల సర్వీసు వ్యాలిడిటీని కలిగి ఉంది.

రూ.895 ప్లాన్ :
ఈ రీఛార్జ్ ప్లాన్ మొత్తం 24జీబీ డేటా (28 రోజులకు రోజువారీగా 2జీబీ ), అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 50ఎస్ఎంఎస్/28 రోజులతో వస్తుంది. అదనపు బెనిఫిట్స్ ప్రకారం.. జియోసినిమా, జియోక్లౌడ్, జియోటీవీ ఉన్నాయి. ఈ ప్లాన్ మొత్తం 336 రోజులు (28 రోజులు) వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లన్నింటితో FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64కెబీపీఎస్‌కి పడిపోతుంది.

Read Also : Jio Airfiber Services : ఆంధ్రప్రదేశ్‌లో జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసుల విస్తరణ.. 45 నగరాల్లో అందుబాటులోకి..!

ట్రెండింగ్ వార్తలు