Karbonn Rebel Series : తక్కువ ధరలో భారీ బ్యాటరీ ఫోన్లు.. కొత్త కార్బన్ రెబెల్ సిరీస్ రీఎంట్రీ.. ధర జస్ట్ రూ.10,999కే..!
Karbonn Rebel Series Launch : కార్బన్ మళ్లీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. రెబెల్, రెబెల్ ప్రో ఫోన్ల ధరలు, 7000mAh బ్యాటరీ, 64MP కెమెరా, Android 16 ఫీచర్లు, అమెజాన్ లభ్యత వివరాలు తెలుసుకోండి.
- Sreehari A
- Published on- November 2, 2026 / 03:07 PM IST
Karbonn Rebel Series Launch
- కార్బన్ రెబెల్ 6.75-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
- 120Hz డిస్‌ప్లే, 64MP కెమెరా.. కార్బన్ రెబెల్ ప్రో ఫీచర్లు
- కార్బన్ నుంచి రెబెల్, రెబెల్ ప్రో లాంచ్.. ఫీచర్లు అదుర్స్
Karbonn Rebel Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మళ్లీ కార్బన్ కంపెనీ రీఎంట్రీ ఇచ్చింది. కార్బన్ రెబెల్ పేరుతో ఈసారి రెండు ఫోన్లను మార్కెట్లోకి దించింది. అందులో కార్బన్ రెబెల్, ప్రో పేర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది.
బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ, మంచి కెమెరా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అందించే ఈ ఫోన్లు అత్యంత ఆకర్షణగా ఉన్నాయి. ఈ కార్బన్ రెబల్ స్మార్ట్ ఫోన్లకు ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కార్బన్ రెబెల్, రెబెల్ ప్రో ధరలివే :
కార్బన్ రెబెల్ ఫోన్ అసలు ధర రూ.14,999 ఉండగా లాంచ్ ఆఫర్‌లో రూ.11,999కే లభిస్తోంది. దీనిపై రూ.1,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. దాంతో కేవలం ఈ ఫోన్ రూ.10,999కే కొనేసుకోవచ్చు. అలాగే రెబెల్ ప్రో అసలు ధర రూ.15,999 కాగా, ప్రారంభ ధర రూ.12,499కు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్లు అమెజాన్‌లో స్పెషల్ ఆఫర్ల కింద లభిస్తున్నాయి.. రెబెల్ 5జీ లాంచ్ తేదీని అతి త్వరలో ప్రకటించనుంది..
డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరాలివే :
కార్బన్ రెబెల్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 650 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. రెబెల్ ప్రోలో 6.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్‌నెస్ అందించారు.
రెండు ఫోన్లలోనూ మీడియాటెక్ హెలియో జీ81 ప్రాసెసర్, ప్యూర్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. రెండు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
కెమెరాల విషయానికి వస్తే.. రెబెల్‌లో 50MP ఏఐ ప్రైమరీ కెమెరా, రెబెల్ ప్రోలో 64MP ఏఐ డ్యూయల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండింటిలోనూ 16MP ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీనే అసలైన హైలైట్ :
కార్బన్ రెబెల్‌లో 7,000mAh భారీ బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రెబెల్ ప్రోలో 6,000mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ కూడా ఉన్నాయి. రెబెల్ బ్లూ, గోల్డ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రెబెల్ ప్రో చెర్రీ రెడ్, బ్లూ, గోల్డ్, గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది..
