Lava Bold N4 Pro 5G : లావా కొత్త ఫోన్ కేక.. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ధర జస్ట్ రూ. 15వేల లోపే.. ఫస్ట్ సేల్ డేట్ ఇదే..!

Lava Bold N4 Pro 5G : భారత మార్కెట్లో లావా బోల్డ్ N4 ప్రో 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే ఉన్నాయి. పూర్తి ఆఫర్, ధర వివరాలివే..

  • Published on- September 20, 2026 / 08:51 PM IST

Lava Bold N4 Pro 5G

  • లావా బోల్డ్ N4 ప్రో 5జీ స్పెషల్ ప్రారంభ ధర రూ. 13,999
  • ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ, 50MP ఏఐ కెమెరా సెటప్
  • సెప్టెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్

Lava Bold N4 Pro 5G : లావా లవర్స్ మీకోసమే.. కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ బోల్డ్ N4 ప్రో 5జీ వచ్చేసింది. ఈ ఫోన్‌లో భారీ 6000mAh బ్యాటరీ, 50MP ఏఐ బ్యాక్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. యూనిసోక్ T820 5జీ చిప్‌సెట్‌తో వస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందిస్తుంది. అన్ని ఆఫర్లతో కలిపి రూ. 13,999 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌కు అమ్మకాలు సెప్టెంబర్ 26న ప్రారంభం కానున్నాయి. పూర్తి ఆఫర్, ధర వివరాలివే..

రూ. 13,999 ధరకు లభ్యం :
లావా బోల్డ్ N4 ప్రో 5జీ ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కోసం రూ. 13,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. సెప్టెంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వస్తుంది. అమెజాన్ ద్వారా మొనాకో బ్లూ, ఓప్యులెంట్ లిలాక్ అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఫొటోగ్రఫీలో లావా బోల్డ్ N4 ప్రో 5జీలో 50ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50MP ఏఐ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు కస్టమర్లు వివిధ స్మార్ట్ కెమెరా ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ కెమెరాలో ఏఐ ఫీచర్లతో వస్తుంది. 6000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.

Read Also : Heavy Rain Alert : ఏపీ వైపు దూసుకొస్తున్న వర్ష ముప్పు.. ఈ జిల్లాలకు అలర్ట్.. బయటకు వెళ్లేవారు జాగ్రత్త!

ఈ 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. హై-రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, స్క్రీన్ మూవెంట్స్ మరింత ఈజీగా కనిపిస్తాయని భావిస్తున్నారు. అయితే, ఈ డిస్‌ప్లేలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఉంది.

పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో యునిసోక్ T820 5జీ చిప్‌సెట్‌ను అమర్చారు. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ 500,000 కన్నా ఎక్కువ AnTuTu స్కోర్‌ను సాధించింది. సాఫ్ట్‌వేర్ పరంగా, లావా బోల్డ్ N4 ప్రో 5జీ ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. నో యాడ్స్, నో బ్లోట్‌వేర్ అనే ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కూడా కంపెనీ పేర్కొంది.

ఈ ఫోన్ అనవసరమైన ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌, యాడ్స్ లేకుండా క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌కు ఐపీ64 రేటింగ్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. లావా ‘ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్’ను కూడా అందిస్తుంది. మీ ఇంటి వద్దకే సర్వీసును అందిస్తుంది.