Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..!

Lava Virat V1 5G : ఈ ఫోన్‌లో స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. యునిసోక్ T8200 చిప్‌సెట్, 8GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్టు కూడా ఉంది. ఫోన్ ఫీచర్లు, ధర వివరాలివే..

Lava Virat V1 5G

  • 4GB + 128GB వేరియంట్ ధర రూ. 14,499 మాత్రమే
  • ఈ ఫోన్‌లో UFS 2.2 స్టోరేజ్, 1TB వరకు పెంచుకోవచ్చు
  • బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా కూడా ఉంది

Lava Virat V1 5G : వావ్.. లావా నుంచి కిర్రాక్ ఫోన్.. 128GB వేరియంట్‌లో లావా కొత్త ఫోన్ వచ్చేసింది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్, లావా విరాట్ V1 5జీ పేరుతో కొత్త వేరియంట్‌ లాంచ్ అయింది. ఈ లావా ఫోన్ భారత మార్కెట్లో ఫస్ట్ టైమ్ గత జూలైలోనే వచ్చింది. అయితే, అది 4GB + 64GB అనే సింగిల్ వేరియంట్‌ మాత్రమే.

కానీ, ఇప్పుడు కంపెనీ హై స్టోరేజ్ వేరియంట్‌ కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో 128GB స్టోరేజ్ ఆప్షన్ అందిస్తుంది. ఈ కొత్త వేరియంట్ ధర, స్పెషల్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

భారత్‌లో 128GB ధర ఎంత? :
కంపెనీ లావా విరాట్ V1 5జీ ఫోన్ 128GB వేరియంట్‌ను లాంచ్ చేసింది. గతంలో ఈ ఫోన్ కేవలం 4GB + 64GB కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభించేది. ఇప్పుడు 128GB వేరియంట్ కూడా లభిస్తోంది. ఈ ఫోన్ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 14,499 కాగా, కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభ్యమవుతోంది.

లావా విరాట్ V1 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ లావా 5జీలో HD+ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేసే 6.75-అంగుళాల LCD ప్యానెల్ ఉంది. స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ప్రాసెసింగ్‌ కోసం యూనిసోక్ T8200 చిప్‌సెట్ అమర్చారు.

Read Also : Japan 6G Device : 5G కన్నా 20 రెట్లు స్పీడ్.. 6Gతో జపాన్ సంచలనం.. 112 Gbps స్పీడ్‌తో ప్రయోగం!

అలాగే, 8GB వర్చువల్ ర్యామ్, 64GB, 128GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో UFS 2.2 స్టోరేజ్ కూడా ఉంది. 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే..
ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా ఉంది. 5MP సెల్ఫీ కెమెరా అందిస్తుంది. ఈ ఫోన్‌కు భారీ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. USB-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్ అందిస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది.

కంపెనీ కేవలం 10W ఛార్జర్‌ను మాత్రమే అందిస్తుంది. ఈ ఫోన్‌లో 5G, 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. సెక్యూరిటీ కోసం పక్కన ఫింగర్‌ప్రింట్ స్కానర్ అమర్చారు. అలాగే స్పీకర్ మంచి సౌండ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ అందిస్తుంది.