Lava Virat V1 Series : వారెవ్వా.. ఫ్లిప్‌కార్ట్‌లో కనిపించిన లావా కొత్త ఫోన్లు.. డిజైన్, ఫీచర్లు ముందే లీక్..!
Lava Virat V1 Phones : లావా కొత్త 4జీ,5జీ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. ఈ నెల 21న భారత మార్కెట్లో మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- July 13, 2026 / 09:49 PM IST
Lava Virat V1 Phones
- ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 21న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్
- ఈ లైనప్‌లో లావా విరాట్ V1 5జీ, విరాట్ V1 ఫస్ట్ రెండు ఫోన్‌లు
- డిజైన్ ఒకటే, రియర్ కెమెరా మాడ్యూల్స్ వేర్వేరుగా ఉండొచ్చు
Lava Virat V1 Phones : లావా నుంచి సరికొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి. వచ్చే వారం భారత మార్కెట్లో లావా విరాట్ వి1 5జీ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు లావా ప్రకటించింది. రాబోయే ఈ ఫోన్ కంపెనీ కొత్త విరాట్ లైనప్‌లో ఫస్ట్ మోడల్ కానుంది. కంపెనీ లాంచ్ తేదీ, డిజైన్, కలర్ ఆప్షన్లను కూడా వెల్లడించింది.
భారత మార్కెట్లో విరాట్ వి1 5జీ కోసం మైక్రోసైట్ కూడా పబ్లీష్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు త్వరలో 4జీ వేరియంట్ లావా విరాట్ వి1 కూడా రానుంది. ఈ రెండు మోడళ్లు ఒకేలాంటి డిజైన్‌న ఉన్నప్పటికీ, రియర్ కెమెరా మాడ్యూల్స్ వేర్వేరుగా ఉంటాయి. లావా విరాట్ వి1 5జీ, 4జీ ఫోన్లకు సంబంధించి పూర్తి ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లావా విరాట్ V1 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే? :
కొత్త లావా విరాట్ సిరీస్ జూలై 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుందని లావా ధృవీకరించింది. ఈ లైనప్‌లో విరాట్ వి1 5జీ ఫోన్, లావా విరాట్ V1 4జీ ఫస్ట్ రెండు ఫోన్‌లుగా చెప్పవచ్చు. అయితే, లావా విరాట్ వి1 ఫోన్ సంబంధించి మైక్రోసైట్ కూడా ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కనిపించింది. ఈ లైనప్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని వెల్లడైంది.
రాబోయే 2 స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. విరాట్ V1 4Gలో రెక్టాంగులర్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో రెండు కెమెరా లెన్స్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 13MP ప్రైమరీ రియర్ కెమెరా యూనిట్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంటాయని అంచనా. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ లావా స్మార్ట్ 4 ప్లస్ మాదిరిగా ఉంటుంది.
విరాట్ వి1 5జీలో రియర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో 2 కెమెరా లెన్స్‌లు, సింగిల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉండొచ్చు. ఈ రెండు ఫోన్‌లలోనూ ఫ్లాట్ రియర్ ప్యానెల్ ఉండొచ్చు. అయితే, 5జీ మోడల్ బ్యాక్ సైడ్ భిన్నమైన మోడల్ ఉండే ఛాన్స్ ఉంది.
కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్‌లు బ్లూ, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. లావా విరాట్ వి1 5జీ, లావా విరాట్ వి1 4జీ ఫోన్లలో పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉంటాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల కిందిభాగంలో సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, స్పీకర్ గ్రిల్, 3.5mm ఆడియో జాక్ మైక్రోఫోన్ కటౌట్ ఉంటాయి.
