iPhone 18 Pro Max : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ వచ్చేస్తోంది.. డమ్మీ ఫొటో లీక్.. కెమెరా ఫీచర్లపై భారీ అంచనాలివే!

iPhone 18 Pro Max : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ అతి త్వరలో రాబోతుంది. లాంచ్ సెప్టెంబర్ నెలలో ఉండగా అంతకన్నా ముందే ఈ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కెమెరా ఫీచర్లు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Leaked iPhone 18 Pro Max

  • ఐఫోన్ 18 ప్రో మాక్స్ కెమెరా మాడ్యూల్ మందం పెరగనుంది
  • ఈసారి కంపెనీ డైనమిక్ ఐలాండ్‌ ఇంకా చిన్నదిగా ఉండొచ్చు
  • 5 రెట్ల వరకు ఆప్టికల్ జూమ్, 15mm సైజులో డైనమిక్ ఐలాండ్

iPhone 18 Pro Max : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ అతి త్వరలో రాబోతుంది. అంతకన్నా ముందే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ సంబంధించి లీకులు రివీల్ అయ్యాయి. రాబోయే ఐఫోన్ సిరీస్‌లోని ఈ టాప్ మోడల్ లాంచ్‌కు ఇంకా సమయం ఉంది. కానీ, ఆపిల్ అభిమానులు ఈ మోడల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కంపెనీ ఇందులో అత్యంత ప్రత్యేకమైన పవర్‌పుల్ ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్‌ కెమెరా (iPhone 18 Pro Max) ఫీచర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఐఫోన్‌లో కీలక అప్‌డేట్ రాబోతోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కోసం కెమెరా అప్‌గ్రేడ్‌లను వెల్లడించినట్లు లీక్ పేర్కొంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌లను ఓసారి వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్ డమ్మీ యూనిట్లు లీక్ :
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కెమెరా అప్‌గ్రేడ్‌లకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ ఐఫోన్ డమ్మీ యూనిట్లు లీక్ అయ్యాయి. వీటిని చూస్తే.. కంపెనీ కెమెరాలో ఎలాంటి అప్‌గ్రేడ్‌లు చేయనుందో తెలుస్తోంది. ఈ డమ్మీ యూనిట్లను యూట్యూబ్‌లో మ్యాక్స్ టెక్ రివీల్ చేసింది. ఈసారి కంపెనీ డైనమిక్ ఐలాండ్‌ను చిన్నదిగా చేయనుంది.

Read Also : BHIM CIBIL Score : సూపర్ గుడ్ న్యూస్.. ఇకపై BHIM యాప్‌తో మీ క్రెడిట్ రిపోర్ట్‌ ఫ్రీగా చెక్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో భారీ మార్పులు :
ఈ సైజును 25శాతం వరకు తగ్గించవచ్చు. ఈసారి సుమారు 15mm సైజులో డైనమిక్ ఐలాండ్‌ను చూడవచ్చు. కంపెనీ ప్రస్తుతానికి పంచ్ హోల్ కటౌట్‌ను వాడటం లేదు. ఆపిల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంచ్ చేయబోయే ఐఫోన్ 20లో ఈ కటౌట్ ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కెమెరా మాడ్యూల్ మందం పెరగవచ్చని అంచనా. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లోని 11.23mmతో పోలిస్తే.. 11.54mm వరకు ఉండవచ్చని లీక్ డేటా సూచిస్తోంది. లెన్స్‌తో కలిపి 13.77mm వరకు చేరవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. కంపెనీ భారీ సెన్సార్‌ను ఉపయోగిస్తోందని స్పష్టంగా సూచిస్తుంది. ఆప్టికల్ జూమ్ 5x వరకు ఉండే అవకాశం ఉంది.

ఆపిల్ ఐఫోన్‌లలోని కెమెరాను ప్రతిసారి అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటుంది. సెన్సార్ సైజు విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 1/1.28-అంగుళాల సెన్సార్ ఉంది. వివో X200 అల్ట్రాలో కూడా కనిపిస్తుంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ఇది ఇంకా పెద్దదిగా ఉండవచ్చు.

ఈ ఐఫోన్ పొడవు కూడా కొద్దిగా పెరగవచ్చు. మందం కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఈసారి కంపెనీ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పెంచవచ్చు. ఈ అప్‌డేట్‌లకు సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.