Samsung Galaxy S25 Ultra 5G : ఖతర్నాక్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 44వేలు డిస్కౌంట్.. ఎలాగంటే?
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. 200ఎంపీ మెయిన్ కెమెరాతో 50ఎంపీ టెలిఫొటో కెమెరా సెటప్ అందిస్తుంది. రూ. 44వేలు చౌకగా పొందవచ్చు.
Samsung Galaxy S25 Ultra 5G
- 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లే
- 200MP మెయిన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్
- 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా సెటప్
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ ధర డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 200MP ప్రైమరీ కెమెరా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ డిస్కౌంట్లు, ఆఫర్లు, ప్రస్తుత ధరపై డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ గత ఏడాది జనవరిలో రూ. 1,29,999 ధరకు లాంచ్ కాగా, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 89,493 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 4వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ఫోన్ ధర రూ. 85,493 అవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ధర రూ. 58,700 వరకు తగ్గుతుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారు రూ. 44వేలు చౌకగా పొందవచ్చు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ 1400×3120 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 2600 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్, 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ7పై రన్ అవుతుంది.
కెమెరా విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.
కొలతల పరంగా, ఈ ఫోన్ 162.8 మిమీ పొడవు, 77.6 మిమీ వెడల్పు, 8.2 మిమీ మందం, 218 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, UWB, GPS USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
