Mobile Data Saving Tips : అరె.. ఇన్నాళ్లూ ఇది తెలియకపాయే.. 1.5GB డేటా ఇక ఫుల్ డే వస్తుంది.. జస్ట్ ఈ 3 సెట్టింగ్స్ మార్చితే చాలు!

Mobile Data Saving Tips : మీ మొబైల్ డేటా వెంటనే అయిపోతుందా? మీ దగ్గర రోజుకు 1.5G డేటా ఉంటే అది రోజంతా ఎలా వాడుకోవాలో తెలుసా? మీ ఫోన్ సెట్టింగ్స్ ఇలా మారిస్తే చాలు.. డేటా సేవింగ్ చేసినట్టే..

Mobile Data Saving Tips

  • మొబైల్ డేటాను ఇలా కూడా సేవ్ చేయొచ్చు తెలుసా?
  • మీ ఫోన్ సెట్టింగ్స్ మారిస్తే 1.5G డేటాను రోజంతా వాడుకోవచ్చు
  • మొబైల్ డేటా వినియోగంపై ఇక టెన్షన్ అక్కర్లేదు
  • ఫోన్‌లో ఈ 3 సెట్టింగ్స్ తెలియకనే డేటా మొత్తం అయిపోతోంది

Mobile Data Saving Tips : మొబైల్ యూజర్లకు అద్భుతమైన టిప్.. మీరు మొబైల్ డేటా ఎక్కువగా వాడేస్తున్నారా? ఎంతపెట్టి రీఛార్జ్ చేసినా క్షణాల్లో డేటా అయిపోతుందా? అయితే ఇది మీకోసమే.. అసలు రోజుకు ఎంత డేటా వాడొచ్చు.. తక్కువ డేటాను కూడా ఎక్కువ సమయం వచ్చేలా చేయలేమా? అంటే కచ్చితంగా చేయొచ్చు. కేవలం సింపుల్ ఫోన్ సెట్టింగ్స్ ద్వారా మీ డేటా సేవింగ్ ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఒకప్పుడు రోజంతా డేటా వాడేందుకు 1GB లేదా 1.5 GB డేటా సరిపోతుందని (Mobile Data Saving Tips) అనుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు.. కొంచెం వీడియో, సోషల్ మీడియా, అదేపనిగా ఇంటర్నెట్ వాడారంటే మీ డేటా క్షణాల్లోనే ఆవిరైపోతుంది. అసలు డేటా ఎప్పుడు అయిపోయిందో కూడా గమనించలేరు.

దాంతో చాలామంది వినియోగదారులు డేటా కోసం పదే పదే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే, కేవలం కొన్ని ప్రైమరీ ఫోన్ సెట్టింగ్‌లను అడ్జెస్ట్ చేస్తే చాలు.. మీ డేటా వినియోగం తగ్గి ఎక్కువ సమయం వస్తుంది. ఇలా చేస్తే 1.5 GB డేటాను ఒక రోజంతా వాడుకోవచ్చు. అనవసరంగా డేటా అయిపోతుందనే టెన్షన్ ఉండదు.

వాస్తవానికి, మీ ఫోన్‌లోని 5G డేటా వినియోగ సెట్టింగ్‌లు, డేటా సేవర్ సెట్టింగ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ డేటా వినియోగ సెట్టింగ్‌లను సెట్ చేస్తే చాలు. ఆ తర్వాత ఫోన్‌లో డేటా వినియోగం అకస్మాత్తుగా భారీగా తగ్గడాన్ని మీరే గమనిస్తారు.

ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌ గేమింగ్, ఆన్‌లైన్ క్లాసులకు ఒక్కోలా వాడుతారు. ఇలా ఈ సెట్టింగ్‌లను మార్చారంటే ఒకరి డేటా వేగంగా అయిపోయే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, మీరు మెసేజింగ్, సోషల్ మీడియా వీడియోలను చూసే రెగ్యులర్ యూజర్లకు ఈ టిప్ కచ్చితంగా వర్క్ అవుతుంది.

Read Also : iPhone 18 Pro Series : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 18 ప్రోలో 5 భారీ మార్పులు.. కెమెరా నుంచి డిజైన్ వరకు..!

మీ ఫోన్‌లో 5G లేదా 4G మోడ్‌ ఎప్పుడు ఎంచుకోవాలి? :
మీ డేటా త్వరగా అయిపోవద్దని భావిస్తే.. ముందుగా 5G మోడ్ నుంచి 4G మోడ్‌కు మారండి. మీరు తప్పనిసరిగా 5G మోడ్‌నే వాడాల్సి వస్తే.. సరైన సెట్టింగ్‌లతో ఆప్షన్ ఎంచుకోండి. వాస్తవానికి, 4G నెట్‌వర్క్‌ల కన్నా 5G నెట్‌వర్క్‌లు ఎక్కువ డేటాను వాడేస్తాయి.

మీరు 5జీ మోడ్ ఎనేబుల్ చేసినా ఐఫోన్ యూజర్ అయితే.. మీ డేటా వేగంగా అయిపోతుంది. అప్పుడు మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ మొబైల్ నెట్‌వర్క్‌ను 4Gకి సెట్ చేయండి. ఒకవేళ 5G తప్పనిసరి అయితే మీ సెట్టింగ్స్‌లో ‘Use Less Data’ ఆప్షన్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేయండి.

డేటా సేవర్ మోడ్‌ ఆన్ చేయండి :
మీ ఫోన్‌లో డేటా త్వరగా అయిపోతుంటే తప్పకుండా డేటా సేవర్ మోడ్‌ను ఆన్ చేసుకోండి. ఈ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు డేటా వినియోగం ఆగిపోతుంది. ఇందుకోసం మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా సేవర్ మోడ్‌ను ఆన్ చేయండి.

యాప్‌ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని ఆపేయండి :
మీ ఇంటర్నెట్ డేటా వినియోగాన్ని తగ్గించాలంటే ముందుగా యాప్‌ల బ్యాక్‌గ్రౌండ్ ఇంటర్నెట్ యాక్టివిటీని కంట్రోల్ చేయండి. మీ ఫోన్‌లో డేటా సేవర్ మోడ్‌ను ఆన్ చేస్తే సరి. ఈ సెట్టింగ్‌లో డేటా సేవర్ మోడ్ ఆన్‌లో ఉన్నా ఏ యాప్‌లు ఇంటర్నెట్‌ను వాడాలి? వాడద్దో మీరే డిసైడ్ చేయొచ్చ. అనవసరమైన డేటా వినియోగాన్ని ఆపడమే కాదు.. మీ ఇంటర్నెట్ ఎక్కువ సమయం వస్తుంది.

అదనంగా, ప్రతి యాప్ ‘యాప్ డేటా’ సెక్షన్‌కు వెళ్లి, ‘Mobile Data’ ఆప్షన్‌ ఓపెన్ చేసి ‘Usage Background Data’ను ఆఫ్ చేయండి. తద్వారా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరంగా డేటాను వాడవు. మీ ఇంటర్నెట్ ఎక్కువసేపు వస్తుంది.