Mobile Device Protection : మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలా? ఈ సెట్టింగ్స్ ఇప్పుడే మార్చండి.. హ్యాకర్లకు చెక్ పెట్టండి!

Mobile Device Protection : మీ స్మార్ట్‌ఫోన్‌ను సైబర్ దాడుల నుంచి ఎలా కాపాడుకోవాలి? స్ట్రాంగ్ పాస్‌కోడ్, స్క్రీన్ లాక్, OTP సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో మీ మొబైల్‌ను సేఫ్టీగా ఉంచుకోండి.

Mobile Device Protection

  • మీ ఫోన్ భద్రమేనా? ఈ 4 టిప్స్ మస్ట్ ఫాలో అవ్వండి
  • మీ మొబైల్‌లో ఈ సెట్టింగ్స్ మార్చండి.. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టండి
  • ఫోన్‌లో OTPలు కనిపిస్తున్నాయా? వెంటనే ఈ పని చేయండి
  • మొబైల్ భద్రత మీ చేతుల్లోనే.. ఫోన్‌ను కాపాడే 4 సింపుల్ మార్గాలు

Mobile Device Protection : నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ అందరి జీవితంలో ముఖ్య భాగమైపోయింది. ఫోన్ కాల్స్ నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల వరకు, ఫొటోల నుంచి వ్యక్తిగత సమాచారం వరకు ప్రతిదీ మన మొబైల్‌లోనే ఉంటుంది.

అయితే, చిన్న నిర్లక్ష్యం కూడా సైబర్ నేరగాళ్లకు అవకాశాన్ని ఇస్తుంది. మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ 4 సింపుల్ టిప్స్ తప్పనిసరిగా పాటించండి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. స్ట్రాంగ్ పాస్‌కోడ్‌తో ఫోన్‌కు ప్రొటెక్షన్ :
చాలామంది తమ ఫోన్లకు 1234, 0000 వంటి ఈజీ పాస్‌కోడ్‌లను పెడుతుంటారు. ఇలాంటి పాస్‌కోడ్‌లను ఇతరులు ఈజీగా గెస్ చేసే రిస్క్ ఉంది. అందుకే ఎవరూ అంచనా వేయలేని స్ట్రాంగ్ పాస్‌కోడ్‌ను పెట్టుకోవాలి. మీ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటే వెంటనే ఎనేబుల్ చేసుకోండి. అయితే, బయోమెట్రిక్ లాక్‌తో పాటు స్ట్రాంగ్ పాస్‌కోడ్‌ను తప్పనిసరిగా పెట్టుకోవాలి.

Read Also : Apple iPhone Duo : రూ.3 లక్షల ఐఫోన్.. కొనేవాళ్లు ఉన్నారా? ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌పై భారీ అంచనాలు!

2. స్క్రీన్ లాక్ టైమ్‌ను తగ్గించండి :
ఫోన్ వాడిన తర్వాత లాక్ చేయడం మర్చిపోతున్నారా? ఇదే మీ వ్యక్తిగత డేటాకు ముప్పుగా మారవచ్చు. మీ ఫోన్ అన్‌లాక్‌లో ఉంటే ఇతరులు మీ మెసేజ్‌లు, ఫొటోలు, ఇతర వివరాలను చూసే ఛాన్స్ ఉంటుంది. అందుకే సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్క్రీన్ టైమ్‌అవుట్‌ను 15 సెకన్లు లేదా 30 సెకన్లకు సెట్ చేసుకోండి. దీంతో ఫోన్ వాడకపోతే స్క్రీన్ త్వరగా ఆఫ్ అవుతుంది.

3. లాక్ స్క్రీన్‌పై OTP కనిపించొద్దు :
బ్యాంకింగ్ లావాదేవీల సమయంలో వచ్చే OTP, పర్సనల్ మెసేజ్‌లు లాక్ స్క్రీన్‌పైనే కనిపిస్తే మీ ప్రైవసీకి భంగం కలగవచ్చు. ముఖ్యంగా బస్సులు, రైళ్లు, ఆఫీసుల్లో ఇతరులు వాటిని చూసే అవకాశం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ సెట్టింగ్స్‌లో మెసేజ్ ప్రివ్యూలను హైడ్ చేయండి. ముఖ్యంగా గుర్తుంచుకోండి.. మీ OTPను ఎవరితోనూ షేర్ చేయొద్దు..

4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను నిర్లక్ష్యం చేయొద్దు :
మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో కొత్త ఫీచర్లతో పాటు భద్రతా లోపాలను సరిచేసే మార్పులు కూడా ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు ఫోన్ సెట్టింగ్స్‌లో అప్‌డేట్స్ చెక్ చేసి అధికారిక అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

గుర్తుంచుకోండి : చిన్న చిన్న జాగ్రత్తలే మీ ఫోన్‌ను సైబర్ దాడుల నుంచి కాపాడుతాయి. మీ స్మార్ట్‌ఫోన్ భద్రత మీ చేతుల్లోనే ఉంది..