Mother’s Day 2026 : హ్యాపీ మదర్స్ డే.. మీ అమ్మ కోసం 5 బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారో మీ ఇష్టం.. ఫస్ట్ ఫోన్ కిర్రాక్!
Mother's Day 2026 : 2026 మాతృ దినోత్సవం సందర్భంగా రూ. 50వేల లోపు ధరలో 5 బెస్ట్ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీరు ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.
Mother's Day 2026
- మే 10, 2026న హ్యాపీ మదర్స్ డే
- అమ్మకు గిఫ్ట్ ఇచ్చేందుకు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు
- శాంసంగ్ నుంచి వివో ఫోన్ వరకు ఏది కొంటారంటే?
Mother’s Day 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2026 మే 10న మదర్స్ డే వస్తోంది. ఈ ప్రత్యేకమైన రోజున మీ అమ్మకు మంచి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయొచ్చు. కెమెరా ఫోన్లు ఇష్టపడేవారు అయితే వారి కోసం మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 50వేల లోపు ధరలో లభించే 5 అద్భుతమైన బడ్జెట్‌కు కెమెరా ఫోన్లను మీకోసం అందిస్తున్నాం..
అందులో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్, వివో V70 వంటి టాప్ రేంజ్ ఫోన్లు ఉన్నాయి. టెలిఫోటో లెన్స్‌లు, 50MP సెల్ఫీ కెమెరాలు, లాంగ్ బ్యాటరీలతో ఈ 5 ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు మీ బడ్జెట్‌కు ధరలోనే లభిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన కెమెరా ఫోన్ కొని మీ అమ్మకు గిఫ్ట్ ఇవ్వొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ [రూ. 48,999] :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈలో 50MP మెయిన్ కెమెరా, 8MP 3x టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 8K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అందిస్తుంది. 6.7-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే (120Hz) కూడా ఉంది. ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 7 ఏళ్ల అప్డేట్లను లాంగ్ టైమ్ అందిస్తుంది. రోజువారీ ఫొటోగ్రఫీకి ఆల్-రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు.
నథింగ్ ఫోన్ 4ఎ ప్రో [రూ. 42,999] :
నథింగ్ ఫోన్ 4a ప్రోలో 50MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ (3.5x జూమ్), 8MP అల్ట్రావైడ్ కెమెరాలతో పాటు వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మీకు 6.83-అంగుళాల అమోల్డ్, 144Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్, 5400mAh బ్యాటరీ కూడా లభిస్తాయి. ఫొటోగ్రఫీని ఇష్టపడే తల్లులకు స్టైలిష్ ఫోన్ అద్భుతంగా ఉంటుంది.
వన్‌ప్లస్ 15ఆర్ [రూ. 49,999] :
వన్‌ప్లస్ 15ఆర్‌లో 50MP ప్రైమరీ + 8MP అల్ట్రావైడ్ కెమెరా 32MP ఫ్రంట్ షూటర్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 6.83-అంగుళాల అమోల్డ్, 165Hz డిస్ప్లేతో వస్తుంది. భారీ 7400mAh బ్యాటరీ రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది.
ఒప్పో రెనో 15 [రూ. 45,999] :
ఒప్పో రెనో 15 ఫోన్ 50MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలకు అద్భుతంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50MP + 50MP + 8MP సెటప్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 6500mAh బ్యాటరీ పవర్ అందిస్తాయి. మీ అమ్మగారికి పోర్ట్రెయిట్లు, సోషల్ మీడియా ఫోటోలు ఇష్టమైతే ఇదే బెస్ట్ ఆప్షన్.
వివో వి70 [రూ. 49,999] :
వివో వి70లో జీసెస్-ట్యూన్డ్ కెమెరాలు ఉన్నాయి. 50MP మెయిన్ + 50MP 3x టెలిఫోటో + 8MP అల్ట్రావైడ్, అదనంగా ఆటోఫోకస్‌తో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో 6.59MP అమోల్డ్ డిస్ప్లే (120Hz) కూడా ఉంది. యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫొటోలు, ప్రీమియం కెమెరా ఫీచర్లకు అద్భుతంగా ఉంటుంది.
