Vivo V70 Series : వివో లవర్స్ కోసం క్రేజీ ఫోన్లు.. వివో V70, వివో Y05e వచ్చేస్తున్నాయ్.. కీలక ఫీచర్లు లీక్..!
Vivo V70 Series : వివో వి70 లైట్ 4జీ, వివో వై05ఇ, ఎఫ్సీసీ డేటాబేస్లో లిస్ట్ అయ్యాయి. బ్యాటరీ కెపాసిటీ, ర్యామ్, కనెక్టివిటీ వంటి కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఈ లిస్టును బట్టి రెండు ఫోన్లు త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Vivo V70 Series
- వివో వి70 లైట్ 4జీ, వివో వై05ఇ ర్యామ్, బ్యాటరీ ఫీచర్లు లీక్
- వివో 70 ఫోన్ 8,000mAh బ్యాటరీతో రానుంది
- 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 5,050mAh బ్యాటరీ
Vivo V70 Series : వివో లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో కొత్త వివో ఫోన్లు వచ్చేస్తున్నాయి. వివో వి70 లైట్ 4జీ, వివో Y05e పేరుతో రెండు ఫోన్లను లాంచ చేసేందుకు రెడీగా ఉంది. ఈ వివో Y05e ఫోన్ FCC డేటాబేస్లో కనిపించింది. వివో నుంచి ఈ ఫోన్ల లాంచ్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వివో వి70 లైట్ 4జీ, వివో వై05ఇ ఫోన్లకు బ్యాటరీ, ర్యామ్ వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఆకర్షణీయమైన ఫీచర్లు :
వివో V70 లైట్ 4జీ (మోడల్ V2604) బ్యాటరీ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో భారీ 7,920mAh బ్యాటరీ ఉండొచ్చు. వివో 70 ఫోన్ 8,000mAh బ్యాటరీతో రానుంది. బ్యాటరీ లైఫ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ కూడా ఉంది. ఫోన్ ఎక్కువ వాడేవారికి ఈ మిడ్-రేంజ్ సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
వివో స్పెసిఫికేషన్లు, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ :
వివో Y05e ఫోన్ (మోడల్ V2606) విషయానికి వస్తే.. ఫీచర్లు కొంచెం తక్కువగా ఉంటాయి. కచ్చితంగా బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 5,050mAh బ్యాటరీతో వస్తుంది. అయినా ఎంట్రీ-లెవల్ ఫోన్కు ఈ బ్యాటరీ చాలా తక్కువే. అంతేకాదు.. ఆర్జిన్ఓఎస్ 6తో ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుందని అంచనా. తక్కువ బడ్జెట్ యూజర్లు కూడా ఈ సరికొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లను పొందవచ్చు.
కనెక్టివిటీ ఆప్షన్లు :
ఈ రెండు స్మార్ట్ఫోన్లలోనూ అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. GSM, UMTS, LTE, బ్లూటూత్, Wi-Fi 5 పవర్ ఫీచర్లతో వస్తున్నాయి. ప్రాసెసర్ లేదా డిస్ప్లేకు సంబంధించి కంపెనీ ఇంకా ఫీచర్లను రివీల్ చేయలేదు. లాంచ్ సమయంలో ఫుల్ ఫీచర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.
వివో V70, వివో V70 FE, వివో V70 ఎలైట్ మోడళ్లతో పాటుగా వివో V70 సిరీస్కు వివో V70 లైట్ 4జీని తీసుకువస్తోంది. ప్రీమియం హార్డ్వేర్ కన్నా భారీ బ్యాటరీని కోరుకునే వారి కోసం ఈ లైట్ వెర్షన్ అద్భుతంగా ఉంటుంది.
కచ్చితమైన లాంచ్ తేదీపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కానీ, ఈ ఫోన్లు మార్కెట్లోకి రావడానికి ముందు FCC అప్రూవల్ పొందాల్సి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర మార్కెట్లతో పాటు భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది.
