Moto G37 Series : మోటోరోలా నుంచి 2 కొత్త 5G ఫోన్లు.. 50MP కెమెరా, 5200mAh బ్యాటరీ అదుర్స్.. ధర జస్ట్ ఎంతంటే?
Moto G37 Series : మోటోరోలా ఇండియా మోటో G37 సిరీస్‌లో మోటో G37, మోటో G37 పవర్ అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 50MP కెమెరా, 5200mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- May 20, 2026 / 06:36 PM IST
Moto G37 Series
- మోటో జీ37 6.7-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- 5200mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా
- 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 5200mAh బ్యాటరీ ఆప్షన్
Moto G37 Series : కొత్త మోటోరో ఫోన్లు వచ్చేశాయి. మోటో లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్లు.. మోటోరోలా ఇండియా మోటో G37 సిరీస్‌లో మోటో G37 అనే కొత్త ఫోన్ లాంచ్ చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ (Moto G37 Series) అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ ఉంది. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5200mAh బ్యాటరీతో రన్ అవుతుంది. మోటో జీ37 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలపై పూర్తి వివరాలను తెలుసుకుందాం..
మోటో G37 ధర ఎంతంటే? :
ధర విషయానికి వస్తే.. మోటో G37 ఫోన్ 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ మే 25న ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక సైట్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ పాంటోన్ నాటికల్ బ్లూ, పాంటోన్ ఇంపెనెట్రబుల్ పాంటోన్ కాప్రి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Also : Google I/O 2026 : మీరు చూస్తున్న ఫొటో రియలా..? ఏఐదా..? గూగుల్ క్రోమ్ ఒక్క క్లిక్‌లో చెప్పేస్తుంది!
మోటో జీ37 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
మోటో జీ37లో 1604×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది. ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400, 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 4GB LPDDR4X ర్యామ్, 64GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
మైక్రో SD కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. కంపెనీ ఒక OS అప్‌డేట్, 3 ఏళ్ల సెక్యూరిటీని అందిస్తుంది. సేఫ్టీ బెనిఫిట్స్ కోసం ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 20W టర్బోఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5200mAh బ్యాటరీతో రన్ అవుతుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
మోటో జీ37 ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2-ఇన్-1 లైట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం.. ఎఫ్/2.0 అపర్చర్‌తో 8ఎంపీ ఫ్రంట్ కెమెరా అందించారు.
కనెక్టివిటీ ఆప్షన్లలో 3.5mm ఆడియో జాక్, 5జీ, డ్యూయల్ 4జీ VoLTE, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్, ఎంఐఎల్-ఎస్టీడీ 810H సర్టిఫికేషన్‌తో వస్తుంది. కొలతల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 166.23 మిమీ పొడవు, 76.50 మిమీ వెడల్పు, 7.85 మిమీ మందంతో 191 గ్రాముల బరువు ఉంటుంది.
