Moto G77 Power : మతిపొగొట్టే ఫీచర్లతో మోటో G77 పవర్ వస్తోందోచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు బ్యాకప్..!

Moto G77 Power : మోటో జీ77 పవర్ ఫోన్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP సోనీ లైటియా-600 కెమెరాతో పాటు, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. పూర్తి వివరాలివే..

Moto G77 Power

  • మోటో G77 పవర్‌లో 6.72-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
  • ఈ స్మార్ట్‌ఫోన్ 7,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది
  • జూలై 8న భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్

Moto G77 Power : మోటోరోలా అభిమానులకు పండగే.. మోటోరోలా నుంచి త్వరలో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో మోటో జీ77 ఫోన్ అంతర్జాతీయ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చే వారం భారత మార్కెట్లో మోటో జీ77 పవర్‌ రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000 mAh బ్యాటరీ ఉంది. మోటో G77 పవర్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP సోనీ లైటియా-600 కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో మోటో G77 ఫోన్ ల్యాండింగ్ పేజీ క్రియేట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 8న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. మోటో G77 పవర్ టీజర్‌లో బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో పాంటోన్ క్యూరేటెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది.

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
మోటో G77 పవర్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన మోటో జీ77లో 6.78-అంగుళాల డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 108MP ప్రైమరీ కెమెరా ఉంది.

Read Also : CIBIL Score : ఒక్క రోజు EMI మిస్ అయితే CIBIL స్కోర్ తగ్గుతుందా? అసలు నిజం ఇదే!

ఇందులో 7,000mAh బ్యాటరీ కూడా ఉంది. బ్యాటరీ లైఫ్ 3 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. మోటో జీ77 పవర్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP సోనీ లైటియా-600 కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది.

ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30వేల కన్నా తక్కువగా ఉంటుంది.

మోటో G37, మోటో G37 పవర్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. మోటో జీ37లో 5,200mAh బ్యాటరీ ఉండగా, మోటో జీ37 పవర్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది.