Motorola Edge 2026 : మోటోరోలా మజాకా.. ట్రిపుల్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్ భయ్యా..!
Motorola Edge 2026 : మోటోరోలా ఎడ్జ్ 2026 ఫోన్ వచ్చేసింది. 50ఎంపీ ట్రిపుల్ కెమెరా, 8జీబీ ర్యామ్ ద్వారా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. పూర్తి ధర వివరాలివే..
- Sreehari A
- Updated on- June 3, 2026 / 11:43 AM IST
Motorola Edge 2026 : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. మోటోరోలా ఎడ్జ్ 2026 కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో కాంపాక్ట్ 6.3-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఓఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 5200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7450 చిప్‌సెట్ అమర్చింది. 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మోటోరోలా ఎడ్జ్ 2026 ధర :
మోటోరోలా ఎడ్జ్ 2026 ప్రపంచవ్యాప్తంగా 599.99 డాలర్లు (సుమారు రూ. 52వేలు) ధరకు లాంచ్ అయింది. ఈ ఫోన్ జూన్ 11వ తేదీ నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు లభిస్తుంది. పాంటోన్ మార్టిని ఆలివ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 2026 స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 2026 ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఓఎల్ఈడీ ప్యానెల్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 5200 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ ఫోన్ 4nm ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆధారిత ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7450 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 8GB LPDDR5X ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ మాలి-G615 ఎంసీ2 జీపీయూ అందిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 2026 బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంది. సోనీ లైటియా 710 సెన్సార్ అమర్చారు. OISకు సపోర్టు ఇస్తుంది. 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉంది. కంపెనీ ఈ ఫోన్‌లో 50MP అల్ట్రావైడ్ లెన్స్ అందించింది. ఈ సెన్సార్‌ను మాక్రో కెమెరాగా కూడా వాడుకోవచ్చు.
అంతేకాదు.. ఈ ఫోన్‌లో 10MP టెలిఫోటో లెన్స్ ఉంది. 3x ఆప్టికల్ జూమ్‌కు సపోర్టు ఇస్తుంది. దీనికి OIS సపోర్ట్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో అనేక ఏఐ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 2026లో 5000mAh బ్యాటరీ, 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ ఉంది. MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా ఉంది. డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 6, బ్లూటూత్ 5.4 ఉన్నాయి.
