×
Ad

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై దిమ్మతిరిగే ఆఫర్ భయ్యా.. అమెజాన్‌లో ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు

Motorola Edge 50 Pro : మోటోరోలా ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..

1/6
Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. ప్రస్తుతం అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో రూ. 14,400 కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మోటోరోలా ఫోన్ పవర్‌ఫుల్ కలర్ డిస్‌ప్లే, స్పీడ్ 125W ఛార్జింగ్‌తో వస్తుంది.
2/6
ఈ ఫీచర్లు కలిసి అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఫాస్ట్ బ్యాటరీ రీఛార్జ్‌లను అందిస్తాయి. ఇలాంటి ఆఫర్‌లు ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కొనుగోలుదారులు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అమెజాన్ డీల్ : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ (12GB + 256GB వేరియంట్) భారత మార్కెట్లో రూ.35,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో, ఈ మోడల్ ప్రస్తుతం రూ.22,790 కు లిస్ట్ అయింది. రూ.13,209 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
4/6
మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత హ్యాండ్‌సెట్‌పై కూడా ట్రేడ్ చేయవచ్చు.
5/6
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇంకా, 125W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ HDR10+ సపోర్ట్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే కలిగి ఉంది.
6/6
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా 3x ఆప్టికల్ జూమ్‌ను అందించే 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఉంది.