×
Ad

Motorola Edge 70 Fusion : మతిపొగొట్టే ఫీచర్లతో కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది.. 7000mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, ధర వివరాలివే!

Motorola Edge 70 Fusion : మోటోరోలా ఫోన్ భారీ 7000mAH బ్యాటరీతో పాటు 50MP సోనీ కెమెరాతో లాంచ్ కాబోతుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫీచర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. పూర్తి వివరాలివే

  • Published On : February 24, 2026 / 12:50 PM IST

Motorola Edge 70 Fusion

  • మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ అతి త్వరలో లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ మైక్రో వెబ్‌సైట్‌‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్
  • OISతో 50MP సోనీ కెమెరా, 68Wతో ఛార్జ్ 7,000mAh బ్యాటరీ
  • 6.78-అంగుళాల 1.5K 144Hz OLED డిస్‌ప్లే

Motorola Edge 70 Fusion : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. మోటోరోలా ఇప్పుడు భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ అధికారికంగా లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ రాకకు సంబంధించి కంపెనీ ఇప్పటికే ప్రకటన చేసింది. సోషల్ మీడియా వేదికగా కమింగ్ సూన్ అనే టీజర్ కూడా రిలీజ్ చేసింది. ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఒక వెబ్‌పేజీని కూడా ప్రారంభించింది.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ అయిన వెంటనే అతి త్వరలో అమ్మకానికి రానుంది. ఈ డివైజ్ అనేక ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. నివేదికల ప్రకారం.. ఈ కొత్త హ్యాండ్‌సెట్ మోటోరోలా ఎడ్జ్ 70గా రాబోతుంది. కాంపాక్ట్ ప్రొఫైల్, ఎడ్జ్ డిజైన్ లాంగ్వేజ్‌తో రానుంది. ఈ కొత్త డివైజ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ వివరాలివే :
ఈ వారం భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. మార్చి మొదటి వారంలో గాడ్జెట్ అమ్మకానికి రావచ్చు. అయితే, ఫోన్ లభ్యత లాంచ్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫీచర్లు :

మోటోరోలా ఫ్లిప్‌కార్ట్ వెబ్‌పేజీలో ఫోన్ కొన్ని ఫీచర్లను రివీల్ చేసింది. ఈ గాడ్జెట్‌లో 6.78-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ OLED స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ గరిష్టంగా 5,200 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఈ ఫోన్‌కు మరింత పవర్ అందిస్తుంది.

Read Also : Samsung Galaxy S26 Series : శాంసంగ్ లవర్స్ మీకోసమే, శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వస్తోందోచ్, ఈ నెల 26నే లాంచ్, ధర ఎంత ఉండొచ్చంటే?

ఈ మోటోరోలా ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ గాడ్జెట్‌లో 50MP సోనీ LYT-710 OIS లెన్స్ ఉంటుంది. అదనంగా మాక్రో సామర్థ్యంతో 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటుందని అంచనా. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఉండవచ్చు. అదనంగా, 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ ఈ ఫోన్ కు మరింత పవర్ అందిస్తుందని భావిస్తున్నారు.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర (అంచనా) :
256GB స్టోరేజీ, 8GB ర్యామ్‌తో ఈ మోటోరోలా ఫోన్ బేస్ మోడల్ ధర సుమారు రూ. 30వేలు ఉంటుందని అంచనా. అయితే, ఈ మోటోరోలా ఫోన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.