Motorola Edge 70 Neo : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 200MP కెమెరాతో ఎడ్జ్ 70 నియో వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..!

Motorola Edge 70 Neo : కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 నియో వచ్చేస్తోంది. 200MP ట్రిపుల్ కెమెరాతో పాటు మొత్తం 4 కలర్ ఆప్షన్లలో రానుంది. లాంచ్ కు ముందుగానే రెండర్లు లీకయ్యాయి.

Motorola Edge 70 Neo

  • మోటోరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్ ముందే ఫీచర్లు లీక్
  • రెండర్‌లలో ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కనిపిస్తోంది
  • ఈ ఫోన్ మ్యాట్ ఫినిషింగ్‌, నాలుగు కలర్ ఆప్షన్లలో రానుంది

Motorola Edge 70 Neo : మోటోరోలా ఎడ్జ్ 70 నియో అతి త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ లాంచ్ సంబంధించి లీక్ డేటా వెల్లడించింది. ఇప్పుడు, ఈ ఫోన్ రెండర్లు కూడా లీక్ అయ్యాయి. మోటోరోలా ఎడ్జ్ 70 నియో, కంపెనీ ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త ఫోన్ చేరనుంది. ఈ ఫోన్‌లో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయని అంచనా. మోటోరోలా ఎడ్జ్ 70 నియో రెండర్లు, డిజైన్‌ను కూడా వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మోటోరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్ ముందే రెండర్లు లీక్ అయ్యాయి. ఈ రెండర్లను మ్యాక్ అబ్జర్వర్ ( Vave ) ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోన్ పింక్, బ్రైట్ గ్రీన్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ అనే 4 కలర్ ఆప్షన్లలో కనిపిస్తుంది. ఈ ఫోన్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది. పింక్ వేరియంట్‌లో భిన్నమైన మోడల్ ఉంది. ఫోన్ డిస్‌ప్లే ఎడ్జుల వద్ద కర్వ్ కనిపిస్తుంది. కంపెనీ ఇప్పటికే ఎడ్జ్ సిరీస్‌లో అద్భుతమైన డిస్‌ప్లేను అందించింది.

Read Also : Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే..

ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కనిపిస్తుంది. సెన్సార్లలో 200MP అని లేబుల్ ఉంది. మెయిన్ కెమెరా సెన్సార్ కావచ్చు. ఎడ్జ్ 70 నియో పూర్తి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. ఈ సిరీస్‌లో ఇప్పటికే అనేక మోడళ్లు ఉన్నాయి.

మోటోరోలా ఎడ్జ్ 70 నియో ఫోన్ గత మోడల్ ఎడ్జ్ 60 నియోకి అప్‌గ్రేడ్ వెర్షన్. మోటోరోలా ఎడ్జ్ 60 నియో 6.36-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 1.5K రిజల్యూషన్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే ఫ్లాట్ pOLED ఎల్టీపీఓ డిస్‌ప్లేతో వస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 50MP సోనీ ప్రైమరీ కెమెరాతో పాటు, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, సింగిల్ USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. 68W టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 70 నియో అప్‌గ్రేడ్ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు.