Motorola Edge 70 Pro Plus : మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Motorola Edge 70 Pro Plus : భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై కనిపించింది. చిప్‌సెట్, ఇతర వివరాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Motorola Edge 70 Pro Plus

  • మోటోరోలా నుంచి కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ వస్తోంది
  • ఈ నెల 4నే భారత మార్కెట్లో మోటోరోలా ఫోన్ లాంచ్
  • చిప్‌సెట్, బ్యాటరీ, ​​ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్, డిస్‌ప్లే లీక్

Motorola Edge 70 Pro Plus : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది. అదిరిపోయే ఫీచర్లతో ఈ నెల 4 భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై కనిపించింది. చిప్‌సెట్, ఇతర వివరాలు రివీల్ అయ్యాయి. లాంచ్ ముందు కంపెనీ ఈ ఫోన్ చిప్‌సెట్ నేమ్, బ్యాటరీ కెపాసిటీ, ​​ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్, డిస్‌ప్లేతో సహా అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను వెల్లడించింది.

కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ప్రో మోడల్‌ అదే చిప్‌సెట్‌తో (Motorola Edge 70 Pro Plus) రన్ అవుతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్‌లో 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌తో అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
రాబోయే మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ కోసం స్పెషల్ వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌తో రన్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది.

ఈ చిప్‌సెట్ 4nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. గరిష్టంగా 3.4GHz స్పీడ్ అందిస్తుంది. AnTuTu బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఈ హ్యాండ్‌సెట్ 24,00,000 పాయింట్లకు పైగా స్కోర్ చేసిందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. ఇందులో 16GB వరకు LPDDR5x ర్యామ్ ఉంటుందని కూడా ధృవీకరించింది.

హీట్ మేనేజ్‌మెంట్ కోసం మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్‌లో 4,600 చదరపు మిల్లీమీటర్ల వరకు వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంది. అంతేకాదు.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ ఉండొచ్చు. రెండు రోజులకుపైగా బ్యాటరీ లైఫ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ 90W వైర్డ్ 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Read Also : Samsung Galaxy A57 5G : సూపర్ డిస్కౌంట్ మావా.. 50MP కెమెరాతో ఈ శాంసంగ్ ఫోన్ రూ. 5000 తక్కువకే.. ఎలాగంటే?

ఈ ఫోన్‌లో 6.8-అంగుళాల 1.5K ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. అంతేకాదు.. కొత్త ఎడ్జ్ 70 సిరీస్ IP68+IP69 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.

MIL-810H సర్టిఫికేషన్‌ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు 3 ఏళ్ల OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌ అందిస్తామని కంపెనీ తెలిపింది.

ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ అందిస్తుంది. ఇందులో సోనీ ఎల్‌వైటీ-710 సెన్సార్, 3.5-డిగ్రీల ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అందిస్తుంది. 50x వరకు డిజిటల్ జూమ్‌ అందిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ జూన్ 4న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. పాంటోన్ చికోరీ కాఫీ, పాంటోన్ స్టార్మీ సీ పాంటోన్ జిన్‌ఫాండెల్ అనే 3 పాంటోన్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ కలర్ వేరియంట్లు స్కల్ప్టెడ్ వుడ్ ఫినిష్, ట్విల్-ఇన్స్పైర్డ్ ఫినిష్ శాటిన్-లక్స్ ఫినిష్ వంటి ప్రీమియం ఫినిష్‌లలో లభిస్తాయి.