Motorola Moto G42 : జూలై 11న మోటో G42 ఫోన్ లాంచ్.. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవే..!

Motorola నుంచి కొత్త G సిరీస్ రాబోతోంది. జూలై 11న గ్లోబల్ మార్కెట్లోకి Motorola Moto G42 లాంచ్ కానుంది.

Motorola Moto G42 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Motorola నుంచి కొత్త G సిరీస్ రాబోతోంది. జూలై 11న గ్లోబల్ మార్కెట్లోకి Motorola Moto G42 లాంచ్ కానుంది. అదే రోజున ఆన్ లైన్ సేల్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ సంబంధించి Flipkartలో లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర మార్కెట్లో రూ. 13,999గా ఉంటుందని అంచనా. కొత్త Moto హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 680 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. IP52 సర్టిఫికేషన్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. 6.4-అంగుళాల AMOLED FHD డిస్‌ప్లేతో రానుంది. స్టాక్ Android 12 OSలో రన్ అవుతుంది. Motorola కంపెనీ Moto G42ని సరికొత్త OS- Android 13తో పాటు 3 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్‌తో అప్‌గ్రేడ్ చేస్తుందని పేర్కొంది.

Motorola Moto G42 Will Launch On July 11 And Here Is How You Can Avail Additional Discounts 

స్టోరేజీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 4GB RAMని కలిగి ఉంది. మరో మోడల్ 64GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. Moto G42 50MP ప్రైమరీ షూటర్, 8MP సెకండరీ షూటర్, మాక్రో ఫోటోగ్రఫీకి ట్రిపుల్ 2MP కెమెరాతో రియర్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్.. హ్యాండ్‌సెట్ 16MP (f/2.2, 1.0μm) యూనిట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 20W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 3.5mm ఆడియో జాక్‌తో వస్తుంది. మ్యూజిక్, OTT ఫాలోవర్లు కోసం ఈ స్మార్ట్ ఫోన్ Dolby Atmos స్టీరియో స్పీకర్లకు సపోర్టు ఇస్తుంది.

ఆఫర్లు.. డిస్కౌంట్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ Moto g42 జూలై 11 నుంచి ఈ కామర్స్ దిగ్గజం Flipkartలో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. దేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మెటాలిక్ రోజ్, అట్లాంటిక్ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

SBI క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈ రెండు వేరియంట్ల కొనుగోలుపై రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. రిలయన్స్ జియో కస్టమర్‌లు Zee5 వార్షిక సభ్యత్వంపై రూ. 569 డిస్కౌంట్‌తో పాటు రూ. 2,000 వరకు జియో రీఛార్జ్‌లను పొందవచ్చు.

Read Also : Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు