Motorola Razr 60 Ultra : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్. ఫోల్డబుల్ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్ ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ప్రస్తుతం అమెజాన్‌లో మీకోసం అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఇప్పుడు భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది.
2/6
ఈ ఫోన్ అసలు ధర రూ. 99,999కి లాంచ్ కాగా ప్రస్తుతం రూ. 80వేల కన్నా తక్కువ ధరకు అమ్ముడవుతోంది. డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, డ్యూయల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, భారీ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అమెజాన్‌లో మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
3/6
అమెజాన్‌లో మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ధర : మోటోరోలా రేజర్ 60 అల్ట్రా అసలు లాంచ్ ధర రూ.99,999 నుంచి రూ.20వేలు తగ్గాక రూ.79,999కు అమ్ముడవుతోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనంగా రూ.10,500 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ధర రూ.69,500 కన్నా ఇంకా తక్కువకు తగ్గుతుంది. మీరు ఈఎంఐలో ఈ మోటోరోలా ఫోన్ కూడా పొందవచ్చు.
4/6
నెలకు ఈఎంఐ దాదాపు రూ.2,813 నుంచి ప్రారంభమవుతుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే వర్కింగ్ కండిషన్, ఇతర అంశాలను బట్టి మీరు రూ. 42వేల వరకు తగ్గింపు పొందవచ్చు. కస్టమర్లు అదనంగా చెల్లిస్తే ఎక్స్‌టెండెడ్ వారంటీ, స్క్రీన్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌లను పొందవచ్చు.
5/6
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్లు : మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఫోన్ 7.0-అంగుళాల ఎల్టపీఓ అమోల్డ్ ఫోల్డబుల్ స్క్రీన్‌తో 165Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 4.0-అంగుళాల pOLED కవర్ డిస్‌ప్లేతో కూడా వస్తుంది. హుడ్ కింద, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (3nm ప్రాసెస్)తో వస్తుంది. 16GB LPDDR5X ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
6/6
ఈ మోటోరోలా 4,700mAh బ్యాటరీతో వస్తుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 30W వైర్‌లెస్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ OISతో 50MP మెయిన్ సెన్సార్‌తో పాటు, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.