Motorola Signature : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా సిగ్నేచర్‌ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!

Motorola Signature : మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ ధర తగ్గింది. 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలతో ఈ మోటోరోలా ఫోన్ రూ. 3వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అదిరే ఆఫర్ ఎలా పొందాలంటే?

  • Published on- September 27, 2026 / 08:37 PM IST

Motorola Signature

  • ఈ ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ సెటప్
  • మోటోరోలా సిగ్నేచర్ మూడు 50MP కెమెరాలు
  • ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌

Motorola Signature : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్‌ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 59,999 ధరకు లాంచ్ చేయగా ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌లో 12GB ర్యామ్, 50MP ట్రిపుల్ కెమెరా ఉన్నాయి. బెస్ట్ ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మోటోరోలా సిగ్నేచర్ డిస్కౌంట్ ఆఫర్ :
మోటోరోలా సిగ్నేచర్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB వేరియంట్ లాంచ్ సమయంలో రూ. 59,999 ధర ఉంది. అయితే, కంపెనీ ఈ ఫోన్‌ను తగ్గింపు ధరతో లిస్టు చేసింది.

ఈ ఫోన్‌పై రూ.3వేలు భారీ తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ ద్వారా ఈ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో మోటోరోలా సిగ్నేచర్‌ను కొంటే అదనంగా రూ.3వేలు తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 56,999కి తగ్గుతుంది.

Read Also : Audi A6 e-tron : ఒక్క ఛార్జ్‌తో 1,338 కి.మీ.! ఆడి A6 ఇ-ట్రాన్ సంచలనం.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!

మోటోరోలా సిగ్నేచర్ స్పెసిఫికేషన్లు :
మోటోరోలా సిగ్నేచర్‌లో 1264×2780 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్ 6,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.8-అంగుళాల సూపర్ HD ఎల్టీపీఓ ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది.

మోటోరోలా సిగ్నేచర్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.