Motorola Razr Fold : ఆపిల్, శాంసంగ్‌కు పోటీగా మోటోరోలా నుంచి కొత్త భారీ ఫోల్డబుల్ ఫోన్‌.. ఫీచర్లపై భారీ అంచనాలివే..!

Motorola Razr Fold : మోటోరోలా రేజర్ ఫోల్డ్ తర్వాత ఇప్పుడు పాస్‌పోర్ట్ సైజులో ఉండే వెడల్పాటి ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానుంది. ఐఫోన్ డ్యూయో లాంచ్ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.

Motorola Razr Fold

  • మోటోరోలా నుంచి కొత్త లాంగ్ డిస్‌ప్లేతో ఫోల్డబుల్ ఫోన్‌
  • సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా కంపెనీ వెల్లడి
  • ఐఫోన్ డ్యూయో, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8కు గట్టి పోటీ

Motorola Razr Fold : మోటోరోలా అభిమానులకు పండగే.. 2025 మేలో భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో ఫస్ట్ బుక్ షేప్ ఫోల్డబుల్ ఫోన్ ‘రాజో ఫోల్డ్’ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ఐఫోన్ డ్యూయో, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, షావోమీ 18 ఫోల్డ్ ఫోన్లకు పోటీగా భారీ వెడల్పు ఉండే ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని మోటోరోలా అధికారికంగా ధృవీకరించింది. మోటోరోలా ఈ వెడల్పాటి డిస్‌ప్లే ఫోల్డబుల్ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేయనుందో ఇంకా రివీల్ చేయలేదు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

మోటోరోలా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా త్వరలో భారీ వెడల్పాటి ఫోల్డబుల్ ఫోన్‌ను టీజ్ చేసింది. ఈ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా షేర్ చేసింది. అందులో ఇప్పటివరకు లాంచ్ చేసిన అన్ని రేజర్ ఫోల్డబుల్ ఫోన్‌లను చూపించింది.

Read Also : Post Office FD : మీకు పోస్టాఫీసులో FD ఉందా? 365 రోజుల ఖాతాపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్!

త్వరలో ఈ ఫ్యామిలీలోకి మరో కొత్త మెంబర్ చేరబోతున్నట్లు కూడా ధృవీకరించింది. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌ లాంచ్ చేశాక మోటోరోలా ఈ టీజర్ వీడియోను లాంచ్ చేసింది. ఆపిల్‌ను ట్రోల్ చేసేందుకు ఈ వీడియోను రిలీజ్ చేశారని యూజర్లు అంటున్నారు. దీని ప్రకారం.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌ త్వరలోనే లాంచ్ చేయనుందని హింట్ ఇచ్చింది..

మోటోరోలా రేజర్ ఫోల్డ్ ఫీచర్లు :
మోటరోలా ఫస్ట్ బుక్ షేప్ ఉండే ఫోల్డబుల్ ఫోన్‌లో 8.1-అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంది. అదనంగా 6.6-అంగుళాల భారీ కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ ఫోన్ మెయిన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ 6200 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 16GB ర్యామ్, 512GB వరకు స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో మెయిన్ కవర్ స్క్రీన్‌లపై 20MP కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ ధర రూ. 1,49,999 నుంచి లభ్యం కానుంది.