ప్రముఖ వ్యాపారవేత్త, ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కలిసి ఓ సూపర్ యాప్ క్రియేట్ చేస్తున్నాయి. చైనీస్ సూపర్ యాప్ WeChat మాదిరిగా మల్టీపర్పస్ యాప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. వాట్సాప్ ప్లాట్ ఫాం, యూజర్ బేస్ కోసం ఈ సరికొత్త యాప్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
ఈ సూపర్ యాప్ ద్వారా రెండు కంపెనీలు సోషల్ మీడియా, డిజిటల్ పేమెంట్స్, గేమింగ్, హోటల్ బుకింగ్స్ వంటి అన్నింటిని ఒకే ప్లాట్ ఫాంపై అందించ నున్నాయి. దీని కోసం వాట్సాప్ యూజర్ బేస్ పాపులారిటీని వినియోగించుకోవాలని RIL భావిస్తోంది. రిలయన్స్ రిటైల్ ద్వారా యూజర్లు ఈ యాప్‌తో గ్రాసరీలను కూడా కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. JioMoney, Ajioలో షాపింగ్ కూడా చేయొచ్చు.
రిపోర్టు ప్రకారం.. ఈ రెండు కంపెనీలు సాంకేతిక నైపుణ్యం, నిధులు, డొమైన్ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి యాప్ ద్వారా RIL నిర్వహించే B2c వినియోగదారుల వ్యాపార కార్యకలపాలకు సర్వీసులను అందించనుంది. వాణిజ్యపరంగా వినియోగించే ఈ సూపర్ యాప్ ప్రస్తుతం వర్క్ జరుగుతోందని డెయిలీ పేర్కొంది. ఇందులో మోర్గాన్ స్టాన్లే కూడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఉన్నట్టు తెలిపింది. సూపర్ యాప్ క్రియేషన్ లో ఇరువురి భాగస్వామ్యం ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఏదైనా కొత్త కంపెనీతో ఫేస్ బుక్, రిల్ కలిసి తమ పెట్టుబడులను సృష్టిస్తాయా? లేదా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఒకటే రిలయన్స్ జియో లేదా రిలయన్స్ రిటైల్ లో పెట్టుబడులు పెడుతుందా లేదో తెలియాల్సి ఉంది. ఇదివరకే ఈ రెండు కంపెనీలు అమెరికా నుంచి టాప్ కన్సెల్టెంట్స్, లాయర్లను నియమించుకున్నట్టు డెయిలీ రిపోర్టు నివేదించింది. ప్రస్తుతానికి ఈ బిగ్ ప్రాజెక్ట్.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నెమ్మదించినట్టు పేర్కొంది.
మరోవైపు.. రిలయన్స్ జియోలో మల్టీ బిలియన్ డాలర్ల షేరును ఫేస్ బుక్ కొనుగోలు చేయనున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. జియోలో 10 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఫేస్‌బుక్ యోచిస్తున్నట్టు తెలిపింది. అయితే ప్రపంచవ్యాప్తంగా విధించిన ట్రావెల్ బ్యాన్ కారణంగా చర్చలు ఆగిపోయాయి. ఈ ఒప్పందం ద్వారా ఫేస్‌బుక్ భారతదేశంలో తన డిజిటల్ పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.